వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌కు ఒబామా గిప్ట్‌గా... 6 వేల కోట్లు, సైనిక చర్యకు సహకరించినందుకేనా..?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా క్రిస్‌మస్ గిప్ట్‌గా పెద్ద బహుమతినే ఇవ్వనున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా చేపట్టిన సైనికచర్యకు సహకరించినందుకుగాను రూ. 6వేల కోట్ల (1 బిలియన్ డాలర్లు) బహుమతిని ప్రకటించారు.

ఈ మేరకు నిధులు మంజూరు చేస్తూ అమెరికా వార్షిక డిఫెన్స్ పాలసీ బిల్లుపై అధ్యక్షుడు బరాక్ ఒబామా సంతకం చేశారు. నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ (ఎన్డీఏఏ) ప్రకారం 2015 ఆర్థిక సంవత్సరానికిగాను మొత్తం రక్షణ రంగానికి 578 బిలియన్ డాలర్లు ఖర్చుచేయాలని నిర్ణయించించింది అమెరికా.

ఐతే, సంకీర్ణ సహకార నిధి (సీఎస్‌ఎఫ్) కింద పాకిస్థాన్‌కు ఒక బిలియన్ డాలర్లు కేటాయించింది. అయితే ఈ నిధుల్ని పాకిస్థాన్‌కు అందజేసే విషయంలో కొన్ని షరతులు విధించింది. పాకిస్థాన్ కేంద్రంగా విధ్వంస కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉగ్రవాద సంస్థలు, ప్రత్యేకించి హక్కానీ నెట్‌వర్క్‌పై తీసుకునే చర్యలను బట్టి ఈ నిధులు అందుతుంటాయి.

 Obama Gift 6 thousand crore to Pakistan

ఈ డిఫెన్స్ పాలసీ బిల్లు అమెరికా రక్షణ మంత్రి ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా సైన్యాన్ని ఉపసంహరించిన తరువాత కూడా సీఎస్‌ఎఫ్ నిధుల పెంపుపై పాకిస్థాన్ చర్చలు జరుపుతూనే ఉంది. ఇరు దేశాల మధ్య భద్రతకు సంబంధించిన అంశాలపై 90 రోజుల్లోగా అమెరికా కాంగ్రెస్‌కు నివేదిక సమర్పించాల్సిందిగా రక్షణ మంత్రిని ఎన్డీఏఏ సూచించింది.

రూ. 6వేల కోట్ల భారీ నజరానా ప్రతి ఆరు నెలలకొకసారి 2017, డిసెంబర్ వరకు సమర్పించే నివేదికల ఆధారంగా పాకిస్ధాన్‌కు విడుదల చేయనుంది. ఈ నజరానాలో కొంత మొత్తాన్ని అమెరికా ఉంచుకుంటుంది. ఎప్పుడైతే ఉత్తర వజీరిస్ధాన్ నుంచి ఉగ్రవాదులను పూర్తిగా తరిమేస్తుందో అప్పుడే ఈ మొత్తాన్ని అందజేస్తుంది.

English summary
US President Barack Obama, Pakistan has a large Giff. Afghanistan by the soldiers themselves, contributing Rs 6 billion ($ 1 billion), a public felicitation huge rewards. This funding will be granted to the extent that the annual defense policy bill, which was signed by President Barack Obama.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X