వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దాడులు ఉత్తదే, గొప్పల కోసమే భారత్: పాక్ ఆర్మీ

By Pratap
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: సరిహద్దులు దాటి ఉగ్రస్థావరాలపై మిలటరీ ఆపరేషన్ జరిపామనే భారత్ మాటల్లో నిజం లేదని, కేవలం కాల్పులు జరిపిందని పాకిస్తాన్ సైన్యం అన్నది.మీడియా ముందు గొప్పలు ప్రదర్శించి, గొప్పలు చెప్పుకోవడానికే భారత్ ఆ మాటలు చెప్పిందని కొట్టిపారేసింది.

భారత్ సర్జికల్ స్ట్రయిక్ చేయలేదని, సరిహద్దుల్లో కాల్పులు మాత్రమే జరిపిందని పాకిస్తాన్ ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. నిబంధనలు అవే వర్తిస్తాయి కాబట్టి పాకిస్తాన్ తీవ్రంగానే ప్రతిస్పందించిందని, ఉగ్రవాదల స్థావరాలపై భారత్ దాడి చేయడమనేది భ్రమ మాత్రమేనని, కావాలిని భారత్ తప్పుడు ప్రభావానికి లోను చేస్తోందని అన్నది.

Pak says no 'surgical strike', 'India fired from across border'

పాకిస్తాన్ భూభాగంపై సర్జికల్ స్ట్రయిక్ దాడి జరిగితే, అదే స్థాయిలో పాకిస్తాన్ తిప్పికొడుతుందని ఆర్మీ ఆ ప్రకటనలో అన్నది. భారత్ మాటల్లో నిజం లేదని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. నియంత్రణ రేఖ నిబంధనలను భారత్ గత రాత్రి ఉల్లంఘించిందని, కొద్దిపాటి కాల్పులు జరిపిందని అన్నారు. పాకిస్తాన్ భారత బలగాల కాల్పులను తిప్పికొట్టిందని అన్నారు.

సర్జికల్ స్ట్రయిక్ చేశామనే భారత ప్రకటనను పాకిస్తాన్ వైమానిక బలగం కూడా ఖండించింది. ఆ విధమైన దాడులను తిప్పకొట్టడానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉందని చెప్పింది.

English summary
Pakistan on Thursday dismissed India's claim that it has conducted a military operation across the LoC to target terrorist launching pads, terming it as a "quest" by India to create media hype by re-branding cross-border fire as surgical strike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X