వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ హై కమిషనర్ కు పాకిస్థాన్ సమన్లు

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: ఎల్ వోసీ (వాస్తవాధీన రేఖ ) వెంబడి కాల్పుల విరమణ ఒప్పందానికి భారత్ తూట్లు పొడుస్తోందని వివరణ ఇవ్వాలని ఇస్లామాబాద్ లోని భారత డిప్యూటీ హై కమిషనర్ జేపీ సింగ్ కు పాకిస్థాన్ సమన్లు జారీ చేసింది.

భారత్ జరిపిన కాల్పుల్లో ఒక జవాను, ఒక పౌరుడు మరణించాడని, అందుకు సమాధానం ఇవ్వాలని మంగళవారం పాక్ భారత్ డిప్యూటీ హై కమిషనర్ జేపీ సింగ్ కు సమన్లు జారీ చేసింది. ఎల్ వోసీని అనుకుని బజ్వత్, చాప్రా, హర్బాల్, సుచేత్ అఘర్, చార్వా సెక్టార్లపై భారత్ విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతోందని పాక్ ఆరోపించింది.

Pak summons India envoy over ceasefire violations

పాక్ భారత్ మీద ఆరోపణలు చేస్తోందని విదేశాంగ శాఖ మంత్రిత్వశాఖ ప్రతినిధులు తెలిపారు. కాల్పుల విషయంపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేసిన పాక్ ఈ మేరకు వివరణ కోరిందని పేర్కొన్నారు.

2016లో భారత్ 90 సార్లు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించిందని పాకిస్థాన్ ఆరోపించింది. అయితే పాక్ ఒక్క సారి కూడా కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించలేదని పాక్ విదేశాంగ ప్రతినిధి నఫీజ్ జకారియా అంటున్నారు.

English summary
India resorted to unprovoked firing across the Line of Control and the Working Boundary in the Bhimber and Chaprar sectors respectively today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X