వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్‌ను మింగేస్తుంది: భారత్‌లో ఆప్గన్ స్పీకర్ హెచ్చరిక

తీవ్రవాదులకు పాకిస్తాన్ అండగా ఉందని, అది తన వైఖరి మార్చుకోకుంటే చివరకి ఆ ఉగ్రవాదం ఆ దేశాన్నే మింగి వేస్తుందని ఆప్గనిస్తాన్ అసెంబ్లీ స్పీకర్ అబ్దుల్ రవూప్ ఇబ్రహీమీ హెచ్చరించారు.

|
Google Oneindia TeluguNews

ఇండోర్: తీవ్రవాదులకు పాకిస్తాన్ అండగా ఉందని, అది తన వైఖరి మార్చుకోకుంటే చివరకి ఆ ఉగ్రవాదం ఆ దేశాన్నే మింగి వేస్తుందని ఆప్గనిస్తాన్ అసెంబ్లీ స్పీకర్ అబ్దుల్ రవూప్ ఇబ్రహీమీ హెచ్చరించారు.

పాక్ పాలకులు ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. ఇండోర్‌లో జరుగుతున్న దక్షిణ ఆసీయా స్పీకర్ల సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ పైన ఆయన ధ్వజమెత్తారు.

మసూద్ అజహర్ నిషేధం: చైనాకు ట్రంప్ షాక్, భారత్‌కు మద్దతుమసూద్ అజహర్ నిషేధం: చైనాకు ట్రంప్ షాక్, భారత్‌కు మద్దతు

Pakistan rulers support terrorism: Afghanistan

పొరుగు దేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడేందుకు ఉగ్రవాదులకు ఊతమిస్తోందని చెప్పారు. దక్షిణ ఆసియా దేశాలకు ఉగ్రవాదం పెనుముప్పుగా మారిందన్నారు. ఆప్గన్ సహా పలు దేశాలు దీని బారిన పడుతున్నాయన్నారు.

పాకిస్తాన్‌ను పరిపాలిస్తున్న నాయకులు అందరు ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతిస్తున్నారన్నారు. వారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అనుసరిస్తున్న విధానాలు.. ఏవీ కూడా ఇతర దేశాల, పొరుగు దేశాల ఆందోళనను పట్టించుకున్నట్లుగా లేదన్నారు. ఇలా చేస్తే త్వరలో పాకిస్తాన్ బాగా దెబ్బతింటుందని హెచ్చరించారు. కాగా, దక్షిణాసియా స్పీకర్ల సదస్సుకు పాకిస్తాన్ డుమ్మా కొట్టింది.

English summary
Amid absence of Pakistan in South Asian Speakers' summit, Afghanistan came down heavily on Pakistan about sponsoring terrorism in the neighbouring states. Afghanistan even said that if Pakistan does not change its policy, terrorism could become a big threat for itself.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X