వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాలిబన్ దాడి: 130 మంది మృతి... ఓ టీచర్‌ సజీవ దహనం, సైనిక చర్యకు ప్రతీకారంగానే దాడి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

పెషావర్: పాకిస్ధాన్‌లో తాలిబన్లు చిన్నారులను బలిగొన్నారు. పెషావర్‌లోని ఓ ఆర్మీ స్కూలుపై దాడికి దిగిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు దిగారు. తాలిబన్ కాల్పుల దాడిలో 130 మందికిపైగా చిన్నారుల మరణించగా, 80 మందికిపైగా గాయపడినట్లు పాకిస్తాన్ హోం శాఖ ప్రకటించింది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఆరుగురు తాలిబన్లను ఆర్మీ అధికారులు హతమార్చారు.

ఒక టీచర్‌ను సజీవ దహనం చేశారు ఉగ్రవాదులు. ఈ ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ముష్కరులు 18 నుంచి 20 సంవత్సరాల వయసు లోపు వారని పాక్ మీడియా ప్రకటించింది. పాక్‌లోని సైనిక స్కూల్లో ఉగ్రవాదుల దాడిని భారత ప్రధాని నరేంద్రమోడీ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో పిల్లలను కోల్పోయిన వారి బాధను తాను కూడా పంచుకుంటున్నానని, వారికి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని చెప్పారు.

ఈ నేపథ్యంలో, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ హుటాహుటిన పెషావర్ బయలుదేరారు. దగ్గరుండి ఆర్మీ స్కూలులో జరుగుతున్న సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. పెషావర్ స్కూలుపై ఉగ్రవాదదాడిని జాతీయ విషాదంగా ప్రకటించారు. ఖైబర్ ఫక్తూంక్వాలో మూడు రోజుల సంతాప దినాలను పాక్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఘటన యావత్ పాకిస్థాన్‌ను వణికిస్తోంది. విద్యార్థుల చేతులపై, కాళ్లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

మా బాధ సైనికులకు తెలియాలనే ఈ దాడి: తాలిబాన్ ఉగ్రవాదులు

పాకిస్ధాన్ సైనికులు తమ కుటుంబాలను లక్ష్యాలుగా చేసుకుని వేధిస్తున్నారని, అన్యాయంగా ఎంతో మందిని బలి తీసుకున్నారని తాలిబాన్ ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబన్ ప్రకటించింది. తమ ఆప్తులను కోల్పోతే, ఆ బాధ ఎలా ఉంటుందో సైనికులకు తెలియాలనే వారి బిడ్డలు చదువుతున్న పాఠశాలపై దాడి చేశామని తాలిబాన్లు స్పష్టం చేశారు.

క్లాస్ రూంలోకి వచ్చి విద్యార్ధులపై కాల్పులు

పాక్ సైనికులు రక్షించిన కొంతమంది విద్యార్ధులు అక్కడి జియో టీవి సిబ్బందితో మాట్లాడుతూ కొంత మంది సైనిక దుస్తులు ధరించి స్కూలు ఆడిటోరియం ద్వారా లోపలికి ప్రవేశించారని తెలిపారు. "లోపలికి రాగానే వారు కాల్పులు జరపడం మొదలు పెట్టారు. మేం వెంటనే భయంతో క్లాస్ రూమ్‌లోకి వెళ్లిపోయాం. వారు ప్రతి క్లాస్ రూంలోకి వచ్చి విద్యార్ధులను చంపడం మొదలు పెట్టారు." అంటూ ఏడస్తూ చెప్పారు.

తాలిబన్ల దాడిని ఖండించిన వసీం అక్రమ్

పెషావర్‌లోని ఆర్మీ స్కూలులో తాలిబన్ల దాడిని మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ తీవ్రంగా ఖండించారు. "నా మాతృభూమిలో భయంకరమైన దాడుల వార్తలను చూస్తున్నాను.. పెషావర్ ప్రజల కోసం ప్రార్ధిస్తున్నా"నని అక్రమ్ ట్వీట్ చేశాడు.

పాక్ ఉగ్రవాద దాడులను ఖండించిన హోం మంత్రి రాజ్‌నాధ్ సింగ్

చిన్నారులపై ఉగ్రవాదుల చర్యలను భారత హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల చర్యలు అమానవీయ, పాశవికమైనవిగా అభివర్ణించారు. ప్రతి ఒక్కరూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. చిన్నారులపై ఉగ్రవాదులు మారణహోమం సృష్టించడం చాలా దారుణమని అన్నారు.

పాకిస్ధాన్‌లోని ఉత్తర వజీరిస్థాన్ ప్రాంతంలో పాకిస్తాన్ సైనిక చర్యకు ప్రతీకారంగానే ఈ దాడి చేశామని తెహ్రీక్-ఇ-తాలిబన్ నేత ఒకరు తెలిపారు. తాము పెద్ద పిల్లలను లక్ష్యంగా చేయమని చెప్పామని చిన్నపిల్లలను కాదని అన్నారు. పెషావర్ నగరంలోని ఆర్మీ స్కూల్లో చిన్న పిల్లలను వదిలివేయాలని అక్కడి సాయుధులైన తాలిబాన్లకు చెప్పినట్టు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబన్ ప్రతినిధి ఒకరు ప్రకటించారు.

గాయపడిన వారిలో 15 మంది పరిస్ధితి విషమంగా ఉంది. ఆర్మీ స్కూలుపై ఉగ్రవాదులు దాడి విషయం తెలుసుకున్న చిన్నారుల తల్లదండ్రులు స్కూలు వద్దకు చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గాయపడిన విద్యార్ధులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆర్మీ స్కూలుపై పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఖండించారు.

తొలుత వాహనం తగులబెట్టిన 8 మంది సైనిక దుస్తులు ధరించిన ఉగ్రవాదులు ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లోకి చొరబడ్డారు. విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన సమయంలో పాఠశాలలో మొత్తం 500 మంది విద్యార్థులు, 70 మంది ఉపాధ్యాయులు ఉన్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల చొరబాటును గమనించిన భద్రతా బలగాలు వెంటనే స్పందించాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి.

Pakistan: Taliban take 500 children hostage in Army school in Peshawar

దీంతో పెషావర్ సిటీలో హైఅలర్ట్ ప్రకటించారు. స్కూలు కిటీకీలు, తలుపులు మూసి ఉండటంతో ఏమీ తెలియడం లేదు. ఉగ్రవాదులకు, సైనికులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ దాడికి తామే బాధ్యులమని తెహ్రికే తాలిబాన్‌ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది.

English summary
An Army school in Peshawar's cantonment area has been attacked by six terrorists on Tuesday morning. According to a Reuters report, the terrorists are holding some 500 students and children hostage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X