వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విండోస్ లేని విమానాలు! స్నాప్‌డీల్‌లో జపాన్ కంపెనీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

లండన్: కిటికీలు లేని విమానం లండన్‌లో టేకాఫ్‌కు సిద్ధమవుతోంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇలాంటి విమానాన్ని బ్రిటన్‌కు చెందిన విమాన కంపెనీలు తయారు చేశాయి. సాధారణ విమానాలకు ఉన్నట్లు దీనికి కిటికీలు ఉండవు. ఆకాశంలోకి విమానం ఎగిరినప్పుడు.. అక్కడి అందాలను చూపే కొన్ని చిత్రాలను చుట్టూ అమర్చారు.

విమానం బయట కెమెరాలను అమర్చారు. అవి తీసే ఫోటోలను లోపల సీట్ల ముందు ఉండే తెరల పైన కనిపించేలా చేశారు. వాటిని ప్రయాణీకులు ఆన్ చేసుకోవచ్చు లేదా ఆఫ్ చేసుకోవచ్చు. ఇష్టం లేనప్పుడు ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకోవచ్చు. త్వరలోనే ఈ విమానానికి టెస్ట్ రన్ నిర్వహిస్తారు.

Passengers planes without windows could be a reality soon

కిటికీలు ఉంటే కిటీకీ పక్కనున్న ప్రయాణీకులే బయట దృశ్యాలను కొంత వరకు చూడవచ్చు. అయితే, ఈ కిటికీలు లేని విమానం ద్వారా ప్రయాణీకులు అందరు కూడా బయట దృశ్యాలను చూడవచ్చు. ప్రతి ఒక్కరు తమ తమ సీట్లలోనే కూర్చొని ఆస్వాదించవచ్చును. కాగా, ఈ విమానం తయారీ కోసం సెంటర్ ఫర్ ప్రాసెస్ ఇన్నోవేషన్ పరిశోధకులు, ఇంజనీర్లు పని చేశారు.

స్నాప్ డీల్‌లో జపాన్ కంపెనీ పెట్టుబడులు

దేశ ఈ-కామర్స్ దిగ్గజం స్నాప్ డీల్.కామ్‌లో జపాన్‌కు చెందిన అతిపెద్ద టెలికాం సంస్థ సాప్ట్ బ్యాంక్ కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. రూ.3,762 కోట్లు పెట్టుబడిగా రానున్నట్లు స్నాప్ డీల్ తెలిపింది.

భారత్‌కు చెందిన ఓ ఆన్ లైన్ సంస్థకు ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు రావడం విశేషం. ఈ పెట్టుబడులను లాజిస్టిక్స్ ఏర్పాటు, కార్యకలాపాల విస్తరణకు వినియోగించనున్నట్లు స్నాప్ డీల్ తెలిపింది. వచ్చే ఆరు నెలల్లో మొబైల్ టెక్నాలజీ మార్కెట్ లో అడుగు పెట్టాలని కూడా భావిస్తున్నట్లు చెప్పింది.

English summary
Passengers planes without windows could be a reality soon
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X