వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'వలసదారులను కాల్చిపారేయండి': ఓ టీచర్ సంచలనం, వలసదారులిలా...

వలసదారులపై అమెరికాలో చోటుచేసుకొంటున్న పరిణామాలు ఇతర దేశస్తులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. వలసదారులపై అమెరికన్లు దాడులకు పాల్పడుతున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్:వలసదారులపై అమెరికాలో చోటుచేసుకొంటున్న పరిణామాలు ఇతర దేశస్తులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. వలసదారులపై అమెరికన్లు దాడులకు పాల్పడుతున్నారు.వలసదారులను తిరిగి పంపడానికి బదులుగా చంపేయండి అంటూ ఓ టీచర్ ట్వీట్ చేసింది.ఈ ట్వీట్ పై వివాదంగా మారింది. దీంతో ఆమెను పాఠశాల యాజమాన్యం ఉద్యోగం నుండి తీసివేసింది.

అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తీసుకొన్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి.ఎన్నికల సమయంలో ట్రంప్ ఇచ్చిన హమీలను నెరవేరుస్తున్నారు.

ట్రంప్ తీసుకొంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి.అంతేకాదు 7 ముస్లిం దేశాలపై ట్రావెల్ బ్యాన్ ను నిషేధం విధించింది అమెరికా ప్రభుత్వం.

అయితే దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో ట్రావెల్ బ్యాన్ పై పున:సమీక్షించాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. అయితే వలసదారులపై బ్యాన్ విషయంలో స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉంది. గ్రీన్ కార్డు దారులకు వలసదారులపై మినహయింపు ఇచ్చే అవకాశం ఉంది.

వలసదారులను వెనక్కి పంపకండి చంపేయండి

వలసదారులను వెనక్కి పంపకండి చంపేయండి

అమెరికాలో ఉన్న వలసదారులను వెనక్కి పంపకండి, వారిని పాయింట్ బ్లాంక్ లో తుపాకీని పెట్టి వలసదారులను కాల్చి చంపేయండి అంటూ ఓ టీచర్ వివాదాస్పదంగా వ్యాఖ్యానించింది.ఈ మేరకు ఆమె తన ట్విట్టర్ అకౌంట్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేసింది. వలసదారులపై ఆమె దారుణంగా అవమానపరుస్తూ మాట్లాడారు. ఆమెను పాఠశాల యాజమాన్యం ఆమెను విధుల నుండి తప్పించారు.

వలసదారులను భయపెడుతున్న అమెరికన్లు

వలసదారులను భయపెడుతున్న అమెరికన్లు

ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమెరికన్లు వలసదారులను తీవ్రంగా ఇబ్బందులుపెడుతున్నారు.వారిని భయ బ్రాంతులకు గురిచేసేలా మాట్లాడుతున్నారు. కొన్ని సందర్భాల్లో వలసదారులను లక్ష్యంగా చేసుకొని చంపుతున్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇదే తరహ ఘటనలు చోటుచేసుకొంటున్నాయి. స్కాట్స్ డేలోని పరదేశ్ జ్యూయిస్ డే పాఠశాలలో చదువుతున్న బోన్నీ వర్నె అనే మహిళా ఉపాధ్యాయురాలు గత పన్నెండేళ్ళుగా థర్డ్ గ్రేడ్ టీచర్ గా పనిచేస్తున్నారు.

వివక్షవ్యాఖ్యలు ఇలా

వివక్షవ్యాఖ్యలు ఇలా

స్వేచ్చా దేశంలో(అమెరికా) కంపు కొట్టేలా పేరుకుపోయిన చెత్తకుప్పల్లో (వలసదారులు, శరణార్థులు) మునిగిపోతున్నారంటూ బోన్నీ వర్నె వివక్షపూరితమైన వ్యాఖ్యలు చేశారు. వలసదారులపై సోషల్ మీడియాలో అడిగిన ప్రశ్నకు ఆమె ఈ రకంగా సమాధానమిచ్చారు.అంతేకాదు వలసదారులపై తన అక్కసును వెళ్ళగక్కారు. అమెరికాలో ఉంటున్న వలసదారులను భయపెట్టేలా కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.

వివక్ష వ్యాఖ్యలకు ఉద్యోగం కోల్పోయిన బొన్నీ వర్నె

వివక్ష వ్యాఖ్యలకు ఉద్యోగం కోల్పోయిన బొన్నీ వర్నె

వలసదారులను ఉద్దేశించి బొన్నీ వర్నె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వారం రోజుల పాటు హల్ చల్ చేశాయి. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేపాయి.వ్యక్తిగతంగా ఆమెకున్న హక్కులను గౌరవిస్తామని, అయితే స్కూల్ పరిధిలో ఉంటూ వ్యాఖ్యలు చేస్తే అంగీకరించబోమని స్కూల్ యాజమాన్యం వర్నెకు తేల్చిచెప్పింది. వ్యక్తిగత పొరపాట్లకు తమ స్కూల్ ఏ మాత్రం అనుమతించబోదని స్పష్టం చేసింది.దీంతో ఆమె తన ఉద్యోగానికి రాజీనామాచేసింది.

English summary
A Phoenix-area teacher resigned Monday after she sent several tweets about killing immigrants instead of deporting them.In a statement, the Pardes Jewish Day School in Scottsdale said Bonnie Verne decided to leave her third-grade teaching role after meeting with school officials. She had taught at the school for 12 years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X