వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్‌లో కూలిపోయిన విమానం: ప్రఖ్యాత సింగర్ సహా 48 మంది మృతి?

పాకిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. పాకిస్థాన్‌ అంతర్జాతీయ ఎయిర్ లైన్స్‌కి చెందిన విమానం బుధవారం కూలిపోయింది. హవేలియన్ పిప్లియన్ వద్ద ఈ విమానం కూలింది.

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. పాకిస్థాన్‌ అంతర్జాతీయ ఎయిర్ లైన్స్‌కి చెందిన విమానం బుధవారం కూలిపోయింది. హవేలియన్ సబర్బన్ గ్రామం పిప్లియన్ వద్ద ఈ విమానం కూలింది. ఈ ఘటనలో 48 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది.

PIA passenger flight PK-661 crashes near Havelian

ఈ విమానం ఉత్తరాది పట్టణమైన చిత్రాల్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు టేకాఫ్ అయింది. విమానంలో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. 6గురు క్యాబిన్ క్రూ ఉన్నారు. ఇస్లామాబాద్‌ వెళ్తున్న వెళ్తోంది. బయలుదేరిన కాసేపటికే రాడార్‌ నుంచి విమానానికి సంబంధాలు తెగిపోయాయి. అనంతరం కూలిపోయినట్లుగా గుర్తించారని తెలుస్తోంది.

విమానంలో 9 మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు, ముగ్గురు విదేశీయులతో సహా మొత్తం 48 మంది ఉన్నట్లు సమాచారం. వీరిలో ఓ ప్రఖ్యాత గాయకుడి కుటుంబం ఉన్నట్లు తెలుస్తోంది. విమానం నేల కూలి మంటల్లో చిక్కుకుందని, ఎవరూ బతికుండే అవకాశంలేదని సహాయక చర్యలు చేపడుతున్న అధికారులు చెబుతున్నారు. సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో అబొటాబాద్ ప్రాంతంలో రాడార్‌తో సంబంధాలు తెగిపోయింది.

English summary
According Civil Aviation Authority sources, the ATR-42 plane with 47 passengers went missing from the radar near Havelian while it was on its way to Islamabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X