వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేపాల్ భూకంపం విధ్వంసం: ఎక్కడ చూసినా శవాల గుట్టలే (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

ఖాట్మండు: భారీ భూకంపంతో చిగురాటుకులా వణికిపోయిన నేపాల్‌లో సంక్షోభం మరింత ముదిరింది. శనివారం 7.9 తీవ్రతతో సంభవించిన ఈ భూకంప మృతుల సంఖ్య 4,000 దాటింది. వీరిలో అస్సాంకు చెందిన ఏడుగురు మహిళలు కూడా ఉన్నారు.

ఈ భూకంపం వల్ల మరో 8000 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. ఈ విపత్తు వల్ల కూలిపోయిన వందలాది భవనాలు, ఇళ్ల శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు సహాయ సిబ్బంది ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. సహాయ బృందాలు ప్రస్తుతం మారుమూల కొండ ప్రాంతాలకు చేరుకోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

భూకంపంలో గల్లంతయిన వందలాది మంది ఆచూకీ కనుగొనేందుకు అంతర్జాతీయ సహాయ బృందాలు విస్తృత ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఇందుకోసం వీరు అత్యాధునిక పరికరాలతో పాటు ప్రత్యేక శిక్షణ పొందిన జాగిలాలను ఉపయోగిస్తున్నారు.

అతలాకుతలమైన నేపాల్

అతలాకుతలమైన నేపాల్

పెను భూకంపానికి నేపాల్ విలవిలలాడింది. శిథిలాలను తొలగించే పని కొనసాగుతోంది.

గుడారాల కిందనే...

గుడారాల కిందనే...


భూకంపం నుంచి ప్రాణాలతో బయటపడిన వేలాది మంది బాధితులు ప్రస్తుతం బహిరంగ ప్రదేశాల్లో గుడారాల కింద బిక్కుబిక్కు మంటూ గడపుతున్నారు.

వణికిపోతూ...

వణికిపోతూ...

శనివారం సంభవించిన పెను భూకంపం, తదనంతర ప్రకంపనల ధాటికి సర్వం కోల్పోయి నిరాశ్రయులుగా మారిన వీరిని ప్రస్తుతం తీవ్రమైన చలి, భారీ వర్షాలు మరింత వేధిస్తున్నాయి.

ఆహారం కోసం అంగలార్పు

ఆహారం కోసం అంగలార్పు

ఆహారం, తాగునీరు, విద్యుత్, ఇంధన, మందుల కొరతతో మరింత సంక్షోభంలో కూరుకుపోయిన వీరి పరిస్థితి విషమించింది. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు వారు ప్రపంచ దేశాల సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

అంతా అదే పరిస్థితి..

అంతా అదే పరిస్థితి..

నేపాల్ రాజధాని ఖాట్మండు చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఇతర గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

అతి పెద్ద సవాల్...

అతి పెద్ద సవాల్...

ప్రస్తుతం బాధితులకు కావలసిన సహాయాన్ని అందించడం అతిపెద్ద సవాలుగా మారిందని నేపాల్ ప్రభుత్వ ఉన్నతాధికారి లీలా మణి పౌడెల్ సోమవారం మీడియాతో సమావేశంలో తెలిపారు.

ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి

ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి

సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు వీలుగా తమకు ప్రత్యేక సహాయ సామగ్రిని, వైద్య బృందాలను అందజేయాలని ఆయన ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు.

మందులు కావాలి...

మందులు కావాలి...

గుడారాలు, ఎక్కువ కాలం నిల్వ ఉండే ఆహార పదార్థాలు, దుప్పట్లు, చాపలు, 80 రకాల మందులను తక్షణమే అందజేయాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరుతున్నామని లీలా మణి ఫౌడెల్ అన్నారు.

English summary
Nepalese officials scrambled on Monday to get aid from the main airport to people left homeless and hungry by a devastating earthquake two days earlier, while thousands tired of waiting fled the capital Kathmandu for the surrounding plains.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X