వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంట్లోకి దూసుకెళ్లిన విమానం: సముద్రంలో మరోటి

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఓ చిన్నతరహా విమానం ప్లేయిన్ విల్లే పట్టణంలోని ఓ ఇంట్లోకి దూసుకెళ్లి పేలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు సజీవదహనం కాగా, ఇంట్లో నివసిస్తున్న నలుగురు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

పెన్సల్వేనియా ఎయిర్ పోర్టు నుంచి నార్‌వుడ్ ఎయిర్ పోర్టుకు బయలుదేరిన ఈ చిన్న తరహా విమానంలో ముగ్గురు ప్రయాణికులున్నారు. ఈ విమానం మరో అరగంటలో గమ్యాన్ని చేరుతుందనగా ప్రమాదానికి గురైంది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని, ప్రమాదంపై విచారణకు ఆదేశించామని ఉన్నతాధికారులు తెలిపారు.

Plane crashes into US home, killing 3 aboard

సముద్రంలో కూలిన బంగ్లా వైమానిక దళ విమానం

బంగ్లాదేశ్‌ వైమానిక దళానికి చెందిన యుద్ధవిమానం ఒకటి బంగాళాఖాతంలో కూలిపోయింది. బంగ్లాదేశ్‌ యుద్ధవిమానం ఎఫ్‌-7 చిట్టగాంగ్‌ నగరంలోని మిలటరీ బేస్‌ నుంచి టేకాఫ్‌ అయిన కొద్ది నిమిషాల్లోనే బంగాళాఖాతంలో కుప్పకూలినట్లు మిలిటరీ అధికారులు చెప్పారు.

ఈ యుద్ధ విమానాన్ని శిక్షణ కోసం వినియోగిస్తున్నట్లు తెలిపారు. విమానం, పైలట్‌ కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. గాలింపు చర్యల్లో నేవీ, చిట్టగాంగ్‌ పోర్టు అధికారులు కూడా పాల్గొంటున్నట్లు చెప్పారు.

English summary
A small plane crashed into a house Sunday evening, killing three people on board, police said, but residents managed to flee as fire engulfed the home.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X