వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూయార్క్‌లో పోలీస్‌ను కాల్చాడు, ముంబైలో అధికారిని కాల్చి ఆత్మహత్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అమెరికాలో ఓ పోలీసు అధికారిని ఓ దుండగుడు కాల్చాడు. ఎవరు నువ్వు, ఇక్కడేం చేస్తున్నావ్ అని ప్రశ్నించినందుకు సదరు పోలీసు అధికారి పైన కాల్పులు జరిపాడు. అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు.

న్యూయార్క్ నగరంలో బ్రియన్ మోర్ అనే పోలీసు అధికారి శనివారం నాడు విధుల్లో భాగంగా గస్తీ నిర్వహిస్తన్నాడు. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో ఆయన తన గస్తీ వాహనంను ఆపి అతడిని ప్రశ్నించాడు. అంతలోనే అతను తుపాకీని తీసి తలకు గురిపెట్టి కాల్చాడు. అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ముంబైలో సీనియర్ అధికారిని కాల్చి, తనను కాల్చుకున్నాడు

Police Officer Is Shot and Critically Wounded in Queens

సెలవు వివాదం కావడంతో సీనియర్ పోలీసు అధికారి పైన కాల్పులు జరిపి, తనను తాను కాల్చుకొని చనిపోయాడు ఓ పోలీస్ అధికారి. ఈ ఘటన ముంబైలోని వాకోలా పోలీసు స్టేషన్లో జరిగింది.

వివరాల ప్రకారం.. అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న దిలీప్ షిర్కే ఓ సెలవు తీసుకున్నాడు. అయితే, ఈ సెలవు పై అధికారులు విచారణ ప్రారంభించారు. దీంతో అతడు బాగా ఒత్తిడికి లోనయ్యాడని కుటుంబ సభ్యులు చెప్పారు. స్టేషన్ అధికారుల వివరాల ప్రకారం.. సీనియర్ పోలీసు ఇన్‌స్పెక్టర్ విలాస్ జోషి గదిలోకి దిలీప్ వెళ్లాక ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

అనంతరం కాల్పుల చప్పుళ్లు వినిపించాయి. వెళ్లి చూసేసరికి సీనియర్ అధికారిపై కాల్పులు జరిపాడు. అనంతరం దిలీప్ తనకు తాను కాల్చుకున్నాడు. వారిని ఆసుపత్రికి తీసుకు వెళ్లేలోగా దిలీప్ మృతి చెందాడు. అనంతరం జోషి అర్ధరాత్రి కన్నుమూశారు.

English summary
Police Officer Is Shot and Critically Wounded in Queens
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X