వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటేసిన ముఖాలేనా: నిరసన మహిళలపై ట్రంప్ దురుసు

తనను వ్యతిరేకిస్తూ, అమెరికాలోని వివిధ నగరాల్లో రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్న మహిళలను ఉద్దేశించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోరు పారేసుకున్నారు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల సమయంలోనే కాదు.. అమెరికా అధ్యక్షుడు అయ్యాక కూడా తన నోటి దురుసు తగ్గించుకోవడం లేదు. తనను వ్యతిరేకిస్తూ, అమెరికాలోని వివిధ నగరాల్లో రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్న మహిళలను ఉద్దేశించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన నోటి దురుసును చూపించారు.

దాదాపు 50 లక్షల మంది మహిళలు ట్రంప్‌కు వ్యతిరేకంగా అమెరికా వీధుల్లో నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, వీరెవరూ అధ్యక్ష ఎన్నికల్లో ఓట్లు వేసిన వారు కాదని ట్రంప్ ఆరోపించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ పెట్టారు.

President Trump tweets on Women’s March protesters: “Why didn’t these people vote?”

'నిన్నటి నిరసనలు చూశాను. ఇటీవలే ఎన్నికలు ముగిశాయి. వీరంతా ఎందుకు ఓట్లు వేయలేదు? ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలు ఓ భాగమేనని అన్ని సమయాల్లో నేను అంగీకరించను. అయితే, తమ మనోభావాలను వెల్లడించే హక్కు ప్రజలకు ఉంది' అన్నారు.

ఎన్నికల్లో ఓట్లు వేయని వాళ్లే ఇప్పుడు నిరసనలకు దిగుతున్నారని ఆరోపించారు. కాగా, మహిళల్లో, మైనారిటీ వర్గాల్లో ట్రంప్ వైఖరి పట్ల ఆందోళన నెలకొందని నిరసనలకు నేతృత్వం వహిస్తున్న సంఘాలు ఆరోపిస్తున్నాయి.

మెక్సికో నుంచి వచ్చిన వలసవాదులు, దేశంలో స్థిరపడ్డ ముస్లింలు ఎంతో ఆందోళనగా ఉన్నారని నిరసనకారులు చెబుతున్నారు. కాగా, ఈ నిరసనల్లో పెద్ద ఎత్తున ప్రముఖులు, నటులు పాల్గొనడం గమనార్హం. పాప్ స్టార్ మడోనా, హీరోయిన్లు చార్జెజ్ థెరాన్, డ్ర్యూ బారీ మోర్, లీనా దున్హామ్ తదితరులు మహిళల నిరసనల్లో పాల్గొని ట్రంప్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

English summary
President Donald Trump, in between tweets about his “long standing ovations” at CIA headquarters and his inauguration’s television ratings, implied in a tweet early Sunday morning that the Women’s March protesters did not vote.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X