వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డొనాల్డ్ ట్రంప్‌ను కాపాడేందుకు రంగంలోకి పుతిన్

అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌ను కష్టాల నుంచి బయటపడేసేందుకు రష్యా అధ్యక్షులు పుతిన్ రంగంలోకి దిగారు. అమెరికా మాజీ జాతీయ సలహాదారు మైఖేల్ ఫ్లైన్‌తో తాను మాట్లాడలేదని చెప్పారు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌ను కష్టాల నుంచి బయటపడేసేందుకు రష్యా అధ్యక్షులు పుతిన్ రంగంలోకి దిగారు. అమెరికా మాజీ జాతీయ సలహాదారు మైఖేల్ ఫ్లైన్‌తో తాను మాట్లాడలేదని చెప్పారు.

2015లో మాస్కోలో జరిగిన ఒక విందు సమావేశంలో పుతిన్‌ పక్కనే ఫ్లైన్‌ కూర్చొని ఉన్న ఫొటో ఇటీవల బాగా వైరల్‌ అయింది. దీంతో ట్రంప్‌కు క్రెమ్లిన్‌కు మధ్య సంబంధాలు ఉన్నాయనే వాదనకు ఇది బలం చేకూరుస్తోందనే విమర్శలు వెల్లువెత్తాయి.

Putin plays down ties with President Trump's ex-adviser Flynn

దీంతో పుతిన్‌ రంగంలోకి దిగారు. ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... నాటి సమావేశం తర్వాతే తనకు ఫ్లైన్‌ ఎవరో తెలిసిందన్నారు.

ఆ పెద్దమనిషి ఒక అమెరికన్‌ అని, కొన్ని విషయాల్లో అతని హస్తముందని, అతను సెక్యూరిటీ సర్వీసుల్లో చేస్తాడని తెలుసునని, అంతకు మించి ఏమీ తెలియదని, అతనితో మాట్లాడింది కూడా లేదని పుతిన్‌ అన్నారు.

English summary
Russian President Vladimir Putin has said he barely spoke to former US National Security Adviser Michael Flynn at a dinner in Moscow in 2015.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X