వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గురపౌర్ణమి స్పెషల్: బ్లూమూన్, ఎలా వస్తుంది?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఈరోజు గురుపౌర్ణమి. అంతేకాదండోయ్ ఆకాశంలో బ్లూమూన్ కనిపించబోతోంది. ఒకే నెలలో రెండు సార్లు పౌర్ణమి వస్తే దానిని బ్లూమూన్ అంటారు. మూడేళ్ల క్రితం ఒకే నెలలో రెండుసార్లు పౌర్ణమి వచ్చింది. మళ్లీ ఇప్పుడు జులై నెలలో ఈ బ్లూమూన్ వచ్చింది.

బ్లూమూన్ అంటే వెండి, బూడిద రంగులో చందమామ కనిపిస్తుంది. ఒకే నెలలో రెండు సార్లు పౌర్ణమి వస్తే రెండోసారి వచ్చే పౌర్ణమిని బ్లూమూన్ అంటారు. జులై 2న తొలి పౌర్ణమి రాగా, మళ్లీ ఈరోజు శుక్రవారం (జులై 31)
న పౌర్ణమి వచ్చింది.

2012లో ఆగస్టులో రెండుసార్లు పౌర్ణమి వచ్చింది. మూడేళ్ల తర్వాత జులై నెలలో వచ్చింది. మళ్లీ 2018 జనవరి 31న బ్లూమూన్‌ని మనం చూడగలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా అగ్నిపర్వతాలు పేలినప్పుడు చందమామ నీలిరంగులో కనిపిస్తుంది.

Rare Blue Moon is on July 31

మొట్టమొదటిసారి 1883లో ఇండోనేసియాలోని క్రాకటోవా అగ్నిపర్వతం పేలినప్పుడు వారంరోజుల పాటు బ్లూమూన్ కనిపించింది. ఆ తర్వాత సరిగ్గా వందేళ్ల తర్వాత 1983లో మెక్సికోలోని చిఖోన్ అగ్నిపర్వతం పేలినప్పుడు మరోసారి బ్లూమూన్ కనిపించింది.

బ్లూమూన్ ఎలా వస్తుంది?

అగ్ని పర్వతాల పేలినప్పుడు వాటి నుంచి వచ్చే బూడిద వాతావరణంలో కలిసే సందర్భంలో మేఘాల వల్ల ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

English summary
The July 31 appearance of the month's second full moon will be the first such occurrence in the Americas since August 2012. Every month has a full moon, but because the lunar cycle and the calendar year aren't perfectly synched, about every three years we wind up with two in the same calendar month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X