వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరుదైన ఆపరేషన్: కృత్రిమ ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలతో 6 రోజులు..

కొద్ది క్షణాల్లో మరణించబోతున్న ఓ మహిళకు ఊపిరితిత్తులు తొలగించారు.. ఆ తరువాత 6 రోజుల పాటు ఆమె కృత్రిమ ఊపిరితిత్తులు, కృత్రిమ గుండె, కృత్రిమ మూత్రపిండాలతో జీవించింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

టొరంటో: కొద్ది క్షణాల్లో మరణించబోతున్న ఓ మహిళకు ఊపిరితిత్తులు తొలగించారు.. ఆ తరువాత 6 రోజుల పాటు ఆమె కృత్రిమ ఊపిరితిత్తులు, కృత్రిమ గుండె, కృత్రిమ మూత్రపిండాలతో జీవించింది. ఆమె ప్రాణాలు కాపాడేందుకు ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స జరిగింది.. ఇప్పుడు ఆమె సంతోషంగా ఉంది.

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది కెనడాలోని టోరంటో ఆసుపత్రిలో నిజంగా జరిగింది. కెనడాకు చెందిన మెలిసా బెనోయిట్(32)కు పుట్టుకతోనే సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే వ్యాధి ఉంది. తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆమెను టోరంటోలోని ఆసుపత్రికి తరలించారు.

Rare Lung Surgery: Woman on Artificial Lungs, Artificial Heart, Artificial Kidneys on 6 Days

ఇలాంటి రోగులనకు ఊపిరితిత్తులు మార్చడమే సరైన మార్గమని డాక్టర్లు భావించేవారు కానీ ఇప్పటి వరకు అలాంటి శస్త్రచికిత్స ఎక్కడా జరగలేదు. బెనోయిట్ ఊపిరితిత్తులలో భారీగా బ్యాక్టీరియా చేరింది. యాంటీబయాటిక్ మందులను ఇవి సక్రమంగా పనిచేయనివ్వడం లేదు.

దీంతో ఆమె శరీరం సెప్టిక్ షాక్ లోకి వెళ్ళిపోతోంది. శరీరంలోని అవయవాలన్నీ నిశ్చల స్థితికి చేరుకుంటూ.. దాదాపు పనిచేయడం మానేస్తున్నాయి. దీంతో ఇన్ఫెక్షన్ కు మూలమైనదానిని తొలగించక తప్పదని సర్జన్లు ఓ నిర్ణయానికి వచ్చేశారు.

అంతే.. అతి క్లిష్టమైన శస్త్రచికిత్స మొదలైంది. 13 మంది వైద్యులు 9 గంటలపాటు శస్త్రచికిత్స నిర్వహించి.. బాగా గట్టిపడి రాళ్లలా మారిన బెనోయిట్ ఊపిరితిత్తులను తొలగించారు. ఈ శస్త్రచికిత్స జరుగుతున్నంతసేపూ కృత్రిమ ఊపిరితిత్తులను ఆమె గుండెకు అనుసంధానం చేశారు.

ఎప్పుడైతే చెడిపోయిన ఊపిరితిత్తులను ఆమె శరీరంలోంచి వైద్యులు తొలగించారో.. అప్పటినుంచి బెనోయిట్ ఆరోగ్యం మెరుగవసాగింది. 6 రోజుల అనంతరం ఊపిరితిత్తుల దాత అందుబటులోకి వచ్చేంత వరకు ఆమె కృత్రిమ ఊపిరితిత్తులు, కృత్రిమ గుండె, కృత్రిమ మూత్రపిండాలతోనే జీవించింది.

అనంతరం ఆమెకు టోరంటో ఆసుపత్రి వైద్యులు మళ్ళీ కొత్తగా ఊపిరితిత్తులు అమర్చారు. వీటిని అమర్చిన తర్వాత ఆమె ఇప్పుడు నెమ్మదిగా నడవగలుగుతోంది. అయితే బెనోయిట్ మూత్రపిండాలు కూడా పాడైపోగా.. ఆమె తల్లి తన మూత్రపిండం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. త్వరలోనే మూత్రపిండాల మార్పిడి శస్త్ర చికిత్స కూడా జరుగుతుంది.

బెనోయిట్‌కు భర్త క్రిస్, మూడేళ్ళ కుమార్తె ఉన్నారు. తన ఆపరేషన్ విషయమై బెనోయిట్ మాట్లాడుతూ.. తనకు ఏం జరిగిందో తెలుసుకోవడానికి కొంచెం సమయం పట్టిందని, ఎట్టకేలకు మృత్యు ముఖం నుంచి బయట పడి ఇంటికి చేరుకున్నానని, తనకు చాలా సంతోషంగా ఉందని పేర్కొంది.

English summary
A woman who underwent surgery to have her lungs removed was kept alive artificially for six days until she regained enough strength to receive donor lungs, doctors at Toronto General Hospital said, calling the life-saving effort a world-first success.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X