వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిరియాలో రష్యన్‌ ఎంబసీపై రాకెట్ల దాడి(వీడియో)

|
Google Oneindia TeluguNews

డెమాస్కస్: సిరియాలో తిరుగుబాటుదారులు రష్యా రాయబార కార్యాలయంపై రాకెట్లతో దాడి చేశారు. సి రియా రాజధాని డెమాస్కస్‌లో ఉన్న రష్యా రాయబార కార్యాలయంపై రెండు రాకెట్లతో తిరుగుబాటుదారులు దాడికి పాల్పడ్డారు.

స్థానిక మీడియా కథనాల ప్రకారం.. తమకు మద్దతు పలుకుతూ తమ దేశ వ్యవహారాల్లో రష్యా కలగజేసుకున్నందుకు ధన్యవాదాలు చెబుతూ వందల మంది సిరియా ప్రభుత్వ మద్దతుదారులు రష్యా రాయబార కార్యాలయం వద్ద మంగళవారం ఉదయం గుమిగూడారు.

అదే సమయంలో తిరుగుబాటుదారులు రాకెట్ల దాడికి పాల్పడ్డారు. కార్యాలయం నుంచి పొగలు కమ్ముకొస్తుండటంతో మద్దతుదారులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం అందలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సెప్టెంబరు 30వ తేదీ నుంచి రష్యా.. సిరియాలోని ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిరియాలోని అల్‌నుస్రా ఫ్రంట్‌ ప్రతీకార చర్యలకు పిలుపునిచ్చింది.

English summary
Two rockets reportedly hit the Russian embassy in the Syrian capital of Damascus on Tuesday, according to a news agency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X