వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సత్య నాదేళ్ల పారితోషకం రూ.516 కోట్లు, 2019నాటికి..

By Srinivas
|
Google Oneindia TeluguNews

సియాటిల్: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదేళ్ల ఈ ఏడాది రూ.516 కోట్లు అందుకుంటున్నారు. ఐటీ ఇండస్ట్రీలో అత్యంత ఎక్కువ వేతనం అందుకుంటున్న వారి జాబితాలో సత్య కూడా ఉన్నారు. సత్య నాదేళ్ల భారత్‌లో జన్మించి అమెరికాలోని మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్‌కు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ఉన్నారు.

జూన్, 2014తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి పారితోషికంగా 84.3 మిలియన్ డాలర్లు (సుమారు రూ.516 కోట్లు) పొందనున్నారు. మైక్రోసాఫ్ట్ ఈ మేరకు యూఎస్ సెక్యూరిటీ కమిషన్‌కు సమాచారం అందించింది. ఈ పారితోషికంలో ఎక్కువ భాగం దీర్ఘకాల స్టాక్ అవార్డు (షేర్లు) రూపంలో ఉండటం గమనార్హం.

ఈ షేర్లు ఆయన 2019 వరకు అందుకుంటారు. అంతేకాకుండా, మైక్రోసాఫ్ట్ షేర్లు ఎస్ అండ్ పీ 500 సూచీని మించి రాణించాలనే అంశం పైన ఇది ఆధారపడి ఉంటుంది.

Satya Nadella karma pays off, gets Rs.84 million package

సత్య నాదేళ్ల 2013లో 7.66 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.45.96 కోట్లు) పారితోషికంగా అందుకున్నారు. ఆయి పారితోషికంలో 9,18,917 డాలర్లు జీతంగాను, 3.6 మిలియన్ డాలర్లు నగదు బోనస్‌గాను, మరో 79.77 మిలియన్ డాలర్లు పైచిలుకు షేర్ల రూపంలోను (స్టాక్ అవార్డ్స్) ఉన్నాయి.

ఇక 2014 ఆఱ్థిక సంవత్సరంలో ఈయన వాస్తవికత వేతనం రూ.1.16 కోట్ల డాలర్లుగా ఉంది. ఇందులో దీర్ఘకాలిక స్టాక్ అవార్డును, సీఈవో కావడానికన్నా పూర్వం ఒకసారి ప్రకటించిన రిటెన్షన్ అవార్డును కలపలేదు. కిందడి ఏడాది ఈయన కంపెనీ క్లౌడ్ అండ్ ఎంటర్ ప్రైజెస్ విభాగానికి ఎగ్జిక్యూటవ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.

సీఈవోగా పదోన్నతిని ఇచ్చిన నేపథ్యంలో దీర్ఘకాలిక పనితీరు ప్రాతిపదికన దాదాపు 59.2 మిలియన్ డాలర్ల ప్రోత్సాహక స్టాక్ అవార్డును కూడా సత్యకు ఇవ్వాలన్న ప్రతిపాదన వచ్చింది. అయితే, ఈ స్టాక్ అవార్డును అందుకోవడానికి 2019 వరకు సత్యకు అర్హత లభించదు.

కిందడి ఏడాది ఆగస్టులో సత్య నాదేళ్లకు 13.49 మిలియన్ డాలర్ల విలువైన ఒకసారి స్పెషల్ రిటెన్షన్ స్టాక్ అవార్డు మంజూరు చేశారు. ఆగస్టు నుండి ఫిబ్రవరి మధ్యలో కంపెనీ కొత్త సీఈవోను అన్వేషించిన తరుణంలో నాదెళ్ల మైక్రోసాఫ్టులో కొనసాగడానికి ఈ భారీ స్టాక్ అవార్డును ప్రకటించారు.

గత ఫిబ్రవరిలో సత్య నాదెళ్లనే కంపెనీ సీఈవోగా నియమించారు. అయితే, మున్ముందు సత్య నాదెళ్ల పారితోషికం తక్కువగా ఉండబోతోంది. 2015 ఆర్థిక సంవత్సరానికి ఆయన మొత్తం పారితోషికం 18 మిలియన్ డాలర్లు (సుమారు రూ.110 కోట్లు) ఉండొచ్చు.

సాఫ్టువేర్ రంగంలోని మహిళలు జీతాన్ని పెంచాలని అడగకూడదని, వారికి అప్పగించిన పనులు చేసుకుంటూ వెళ్లాలని, అప్పుడు వారికి రావాల్సిన పారితోషికం అదే వస్తుందంటూ సత్య నాదేళ్ల ఇటీవల సుకర్మ గురించి చెప్పారు. దీని పైన పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తాను అలా మాట్లాడటం తప్పేనని, సత్య నాదేళ్ల క్షమాపణలు కూడా చెప్పారు.

English summary
Satya Nadella karma pays off, gets Rs.84 million package
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X