వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పనిమనిషితో భర్త శృంగారం: యూట్యూబ్‌లో భార్య పోస్ట్ (వీడియో)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

రియద్: తాను ఇంట్లో లేనప్పుడు పని మనిషితో తన భర్త నెరపుతున్న శృంగారాన్ని సౌదీ అరేబియాకు చెందిన ఓ మహిళ రహస్య కెమెరాతో చిత్రీకరించి దానిని 'యూట్యూబ్'లో పోస్ట్ చేసింది. 12 గంటల్లోపే 25 వేల మంది ఈ వీడియోని షేరు చేశారు.

మక్కా తొక్కిసలాట తర్వాత సౌదీ ప్రభుత్వం సోషల్ మీడియాపై పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా భర్త పరువు తీసేలా ఉన్న వీడియోని వెంటనే తొలగించాల్సిందిగా సౌదీ ప్రభుత్వం స్ధానికి అధికారులను ఆదేశించింది. అంతేకాదు భర్త పరువు తీసినందుకు ఏడాది పాటు జైలు శిక్ష లేదా 87 లక్షల రూపాయలు జరిమానాగా చెల్లించాల్సి ఉంటుందని సౌదీ ప్రముఖ న్యాయవాది ఆ మహిళను హెచ్చరించారంట.

Saudi Arabia 'may jail woman who posted video of husband groping housemaid'

భర్త ప్రవర్తనపై ఎప్పటి నుంచో ఆ మహిళకు అనుమానం ఉంది. తాను లేనప్పుడు పని మనిషులతో సరస సల్లాపాలు సాగిస్తాడని అనుకుంది. ఓ రోజున కిచెన్‌కు సమీపంలో రహస్యంగా ఓ వీడియో కెమెరాను ఏర్పాటు చేసింది. ఇక వీడియో విషయానికి వస్తే కిచెన్ లోపల పనిమనిషి సంచరిస్తుండగా మహిళ భర్త దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించడం, ఆ అమ్మాయి తప్పించుకోవడానికి ప్రయత్నించడం లాంటివి అందులో రికార్డై ఉంది.

‘ఈ నేరానికి కనీస శిక్ష విధించాలి' అన్న పేరుతో ఆ వీడియో క్లిప్పింగ్‌ను యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది భార్య. అయితే ఇప్పుడు ఈ వీడియోని భార్య యూట్యూబ్‌లో పోస్ట్ చేయడం పెద్ద వివాదాస్పదమైంది. మొబైల్ లేదా ఇతర కెమెరాల ద్వారా వ్యక్తిగత అంశాలను రికార్డుచేసి అందరిలో వారి పరువు తీయడం స్థానిక సమాచార సాంకేతిక చట్టాల ప్రకారం పెద్ద నేరమని న్యాయవాది మజీద్ ఖరూబ్ స్థానిక మీడియాతో వ్యాఖ్యానించారు.

ఇది ఇలా ఉంటే, భార్యలతో కాకుండా ఇతరులతో శారీరక సంబంధం పెట్టుకోవడం సౌదీ అరేబియాలో పెద్ద నేరం. ఈ నేరం రుజువైతే అతడికి మరణ శిక్ష విధిస్తారు.

English summary
A Saudi woman who filmed a clip appearing to show her husband groping their housemaid could face prison because of the nation's defamation laws.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X