వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గన్ ఉంటే హిల్లరీ క్లింటన్ ను అడ్డుకోండి: ట్రంప్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిల్లరీ క్లింటన్ వైట్ హౌస్ కు చేరకుండా అడ్డుకోవాలని అమెరికన్లకు పిలుపునిచ్చారు.

లైసెన్స్ తుపాకి ఉన్న ప్రతి అమెరికన్ పౌరుడు హిల్లరీ క్లింటన్ వైట్ హౌస్ చేరకుండా అడ్డుకుంటారని వ్యాఖ్యానించారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు హిల్లరీ క్లింటన్ ను కాల్చి చంపాలని సూచిస్తున్నారా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

విల్మింగ్ టన్ లో జరిగిన ప్రచార కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడారు. హిల్లరీ క్లింటన్ అధికారంలోకి వస్తే అమెరికన్లకు మాత్రమే వర్తించే గన్ లైసెన్స్ సెకండ్ అమెండ్ మెంట్ ను తొలగిస్తారని చెప్పారు.

Second Amendment people could stop Hillary: Trump

ఈ వ్యాఖ్యలు హిల్లరీ క్లింటన్ ను కాల్చి చంపాలని సందేశం ఇచ్చే విధంగా ఉన్నాయని అమెరికా లా మేకర్స్ అంటున్నారు. అయితే రిపబ్లికన్ ప్రచారకార్యక్రమ నిర్వహకులు మాత్రం ట్రంప్ వ్యాఖ్యల పై వస్తున్న వార్తలను ఖండించారు.

నిజాయితీ లేని మీడియా కావాలనే ట్రంప్ ప్రచారంపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నదని అన్నారు. సెకండ్ అమెండ్ ద్వారా లబ్ధి పొందుతున్న ఓటర్లు లక్షల మంది ఉన్నారని, వారిని ఆకర్షించడానికి ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.

ప్రచార కార్యక్రమం అయిన తరువాత ట్రంప్ మీడియాతో మాట్లాడారు. హిల్లరీ అధికారంలోకి వస్తే సుప్రీం కోర్టు ద్వారా సెకండ్ అమెండ్ మెంట్ బిల్లును రూపుమాపుతారని చెప్పారు. గన్ లైసెన్స్ కలిగివున్న వారికి ఎవరికి ఓటు వెయ్యాలో బాగా తెలుసు అని అన్నారు.

English summary
The Trump campaign quickly refuted any such inference and asserted that Trump meant political power to stop Clinton at polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X