వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: బ్రిటన్ లో 23 వేలమంది అనుమానిత ఉగ్రవాదులు?

బ్రిటన్ లో వేలాది మంది అనుమానిత ఉగ్రవాదులున్నట్టు అక్కడి నిఘావర్గాలు అంచనావేస్తున్నాయి. ఏకంగా 23 వేల మంది అనుమానిత ఉగ్రవాదులు ఉన్నట్టు భావిస్తున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

లండన్: బ్రిటన్ లో వేలాది మంది అనుమానిత ఉగ్రవాదులున్నట్టు అక్కడి నిఘావర్గాలు అంచనావేస్తున్నాయి. ఏకంగా 23 వేల మంది అనుమానిత ఉగ్రవాదులు ఉన్నట్టు భావిస్తున్నారు.

ఇటీవల మాంచెస్టర్ దాడుల తర్వాత ఉలిక్కిపడిన బ్రిటన్ ఉగ్రవాదం తమకు సవాల్ గా మారిందని భావించి సమీక్షలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే నిఘా అధికారులను ఈ తరహా కేసులను విచారించిన అధికారులనుండి దేశ అత్యున్నత నిఘా విభాగం ఉగ్రవాదుల జాడలు తెలుసుకొనే ప్రయత్నం చేయగా 23 వేల మంది వివిద రూపాల్లో ఉగ్రవాదులు ఉన్నట్టు ఒక అంచనావకు వచ్చారు.

ఇటీవల పాప్ సింగ్ అరియానా గ్రాండ్ మాంచెస్టర్ లో సంగీత విభావరి నిర్వహిస్తుండగా సల్మాన్ అబేదీ అనే 22 ఏళ్ళ ఉగ్రవాది అమర్చిన బాంబులు పేలి 22 మంది మరణించారు. ఈ దాడిలో 119 మంది గాయపడ్డారు.దక్షిణ మాంఛెస్టర్ లో ముగ్గురి, అక్కడికి దగ్గర్లోనే మరోకరిని పోలీసులు అరెస్టు చేశారు.

Security services believe 23,000 terror suspects at large in UK

లిబియన్ సంతతికి చెందిన సల్మాన్ అబేదీ ముందు నుండే నిఘా పరిశీలనలోఉన్నాడు. మాతృదేశం లిబియా అయి ఉండి కూడ బ్రిటన్ లో జన్మించిన అతడు ఇటీవల లిబియా, సిరియా పలుమార్లు వెళ్ళొచ్చాడు. ఆ తర్వాతే అతడు ఉగ్రవాదిగా మారి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

నిఘావర్గాలు అంచనావేస్తున్న 23 వేల మంది అనుమానిత ఉగ్రవాదుల్లో మూడువేల మంది మాత్రం వివిద విచారణల్లో చాలా ప్రమాదకరమైన వ్యక్తులుగా తేలడంతోపాటు ఇప్పటివరకు పోలీసులు నిర్వహించిన 500 ఆపరేషన్లలో దొరికినవారిలో ఉన్నారు. మిగిలిన 20 వేల మంది మాత్రం గతంలో విచారించి వివిద కేటగిరిల్లో చేర్చిన వ్యక్తులుగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

English summary
Britain's spies believe there may be as many as 23,000 terror suspects at large across the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X