వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్రగ్స్ ముఠాపై పోలీసుల కాల్పులు: 43మంది మృతి

|
Google Oneindia TeluguNews

మెక్సికో: మెక్సికోలో డ్రగ్స్‌ముఠాపై భద్రతా దళాలు విరుచుకు పడ్డాయి. భద్రతా దళాలు జరిపిన దాడుల్లో 43 మంది డ్రగ్స్ ముఠా సభ్యులు మృతి చెందారు. మిచోకన్‌ రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

మరణించిన వారంతా అనుమానిత నేరస్తులే అని అధికారులు స్పష్టం చేశారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. సైనిక దళానికి చెందిన వాహనాలు కూడా అక్కడకు బారులు తీరాయి. ఇటీవల మాదకదవ్రాల ముఠాలు మెక్సికోలో రెచ్చిపోతున్నాయి.

Shoot out in Mexico: 43 people killed in Michoacan

వారిని అడ్డుకునేందుకు ఆర్మీ ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహిస్తోంది. తాజా ఘటనలో రెండు వర్గాల మధ్య బీకరంగా కాల్పులు జరిగాయి. డ్రగ్స్‌తో వెళ్తున్న ఓ ట్రక్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆ ట్రక్కులో ఉన్న ముఠా సభ్యులు కాల్పులకు తెగబడ్డారు.

దీంతో పోలీసులు ఎదురుకాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో 43మంది డ్రగ్‌ ముఠా సభ్యులు మృతి చెందారు. వారి నుంచి 30 తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, గత మార్చిలో డ్రగ్స్ మాఫియా దాడిలో 20మంది పోలీసులు, జవాన్లు మృతి చెందారు.

English summary
Mexico City, May 23: At least 43 people including a police official were killed in a shoot out in Mexican state of Michoacan, media reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X