వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవరు కొట్టారు?: బర్మింగ్‌హాంలో సిక్కు వ్యక్తిపై దాడి వీడియో హల్‌చల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

లండన్: బర్మింగ్‌హామ్‌లో ఓ సిక్కు వ్యక్తిని వీధుల్లో చితకబాదిన ఓ వీడియో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. దీంతో, స్థానిక పోలీసులు దీని పైన విచారణ చేస్తున్నారు. ఈ సంఘటన మతపరంగా జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. సిక్కు వ్యక్తి పైన దాడి చేసిన వారు ఎవరో స్వచ్చంధంగా లొంగిపోవాలని పోలీసులు చెప్పారు.

డెయిలీ సిక్ అప్‌డేట్ అనే ఫేస్‌బుక్ పేజీలో ఈ దాడి ఫుటేజీ ఇంటర్నెట్లో పెట్టారు. ఆ ఫుటేజీలో ఓ వ్యక్తి తనను కొట్టేందుకు ప్రయత్నిస్తుండగా సిక్కు వ్యక్తి తన ముఖానికి చేతులు అడ్డం పెట్టుకున్నాడు.

ఈ ఘటన సమయంలో చుట్టుపక్కల చాలామంది గుమికూడారు. కానీ అతనిని రక్షించేందుకు ఎవరు కూడా ముందుకురాలేదు. చివరకు ఓ వ్యక్తి దానిని ఆపే ప్రయత్నం చేశాడు. ఇది ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది.

Sikh man brutally beaten in Birmingham street sparks police probe into 'race hate attack'

మిడ్ ల్యాండ్స్ పోలీసు అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ఓ వ్యక్తిని కొడుతున్న వీడియోను చూశామని, ఈ సంఘటన మార్చి 29వ తేదీన బర్మింగ్ హామ్ వీధుల్లో జరిగిందని చెప్పారు. ఈ సంఘటన మతపరంగా జరిగి ఉంటుందని అనుమానిస్తున్నట్లు చెప్పారు.

దీనిని తాము చాలా సీరియస్‌గా తీసుకున్నామని, దీనిపై పూర్తి విచారణ చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం తాము ఏం జరిగిందనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. సంఘటన ప్రాంతానికి వెళ్లి అడిగితే, ఎవరు కూడా తాము ఈ దాడికి పాల్పడ్డట్లు చెప్పలేదన్నారు.

English summary
Police have launched an investigation after footage of a Sikh man being beaten up in the street emerged online
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X