వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుటుంబమంతా చూస్తుండగానే సెక్స్ : అక్కడదో ఆచారం..

|
Google Oneindia TeluguNews

సింగపూర్ : ఇండియా లాంటి సాంప్రదాయిక దేశాల్లో అయితే 'సెక్స్' అనే పదాన్ని నలుగురి ముందు ఉచ్చరించడానికే సంకోచించాల్సిన పరిస్థితి. అలాంటిది ఏకంగా నలుగురు చూస్తుండగానే సెక్స్ లో పాల్గొనడమనేది బరితెగించడం.. దిగజారుడు తనానికి నిదర్శనంగానే భావించాల్సి ఉంటుంది. కానీ సింగపూర్ కి చెందిన ఓ వంశానికి మాత్రం అదో ఆచారం. తరాలుగా కొనసాగిస్తూ వస్తోన్న సాంప్రదాయం.

మనిషికో బుద్ది.. పుర్రెకో ఆలోచన అన్న చందంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో ఆచార సాంప్రదాయాలు ఆయా తెగల్లో వంశాల్లో కొనసాగుతున్నాయి. ఇందులో ఉన్న బోల్డ్ నెస్ కి సంబంధించి మంచి, చెడుల కంటే తర్వాతి తరాలు కూడా అవే సూత్రాలను పాటించాలనే నిబంధనలను ఆచరణలో పెడుతున్నారు.

సింగపూర్ లోని వుడ్ ల్యాండ్ టౌన్ లో నివసించే ఓ కుటుంబం కూడా ఇదే కోవలోకి వస్తుంది. అక్కడి కుటుంబ ఆచార సాంప్రదాయల ప్రకారం కుటుంబంలో కొత్తగా పెళ్లి చేసుకున్న ఏ జంట అయినా సరే, తమ మొదటి శృంగారాన్ని కుటుంబ సభ్యులందరి ముందు సాగించాల్సిందే. ఈ తతంగాన్నంతా ఆ కుటుంబంలోని సభ్యులు వీడియో కూడా తీసుకోవచ్చట.

Singapore Family Insist On Observing Son Make Love For The First Time

ఇంకా.. విస్మయానికి, జుగుప్సకు గురి చేసే విషయమేంటంటే.. కొత్త జంట శృంగారంలో పాల్గొంటుంటే పెళ్లి కుమారుడి తల్లి పక్కనే ఉండి శృంగారానికి సంబంధించిన మెలుకువల గురించడం సలహా సూచనలు ఇవ్వడం. ఎలా బయటపడిందో తెలియదు గానీ, ఓ కుటుంబంలో జరిగిన ఇలాంటి తతంగమంతా ఇంటర్నెట్ లోకి ఎక్కేసింది.

ఇంకేముంది క్షణాల్లో వైరల్ గా మారిపోయి ప్రపంచమంతా ఈ వార్త పాకిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలోను హల్ చల్ చేస్తోన్న ఈ వీడియోకి సంబంధించిన ఫోటోల పట్ల అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు.

దీనిపై వివరణ ఇచ్చుకున్న ఆ కుటుంబ సభ్యుల వాదన మాత్రం మరోలా ఉంది. తొలిసారి కొత్త జంట మధ్య శృంగార ఘట్టానికి సాక్షులుగా ఉండడం, ఆ మధుర క్షణాలను దగ్గరుండి చూడడం మాకు గర్వకారణంగా ఉంటుందని చెప్తున్నారు సదరు కుటుంబ సభ్యులు.

English summary
Singaporean social media has been captivated by an unusual story concerning a family living in Woodlands New Town. A photo was posted by a member of the family earlier this week, and it has since gone viral, receiving thousands of comments from members of the public. The image depicts a unexpected scene: a male and a female lie in bed, in the middle of intercourse, while members of their family watch on. The intimate moment was captured by the man’s uncle, who revealed it was a family tradition that has been passed down through generations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X