వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: సీటు అడిగినందుకు విమానం నుండి దించేశారు

By Narsimha
|
Google Oneindia TeluguNews

కాలిఫోర్నియా: విమానాలు ఆర్టీసి బస్సుల మాదిరిగా మారిపోయాయి. ఎక్కువమందికి టిక్కెట్లు విక్రయించడం వారికి సీట్లు చూపలేకపోతున్నారు.అయితే సీట్లు అడిగినవారిని అర్ధాంతరంగా విమానం నుండి దించేస్తున్నారు.ఈ తరహా ఘటన అమెరికాలో చోటుచేసుకొంది.

విమానంలో సీటునుండి లేవాలని గదమాయించడమే కాకుండా ఓ కుటుంబాన్ని విమానం నుండి దించేసిన ఘటన డెల్టా ఎయిర్ లైన్స్ లో చోటుచేసుకొంది. దక్షిణ కాలిఫోర్నియాలోకు చెందిన బ్రయాన్ తన భార్య, ఇద్దరు కుమారులతో కలిసి డెల్టా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో లాస్ ఎంజిల్స్ కు వెళ్ళాల్సి వచ్చింది.

కానీ, బ్రయాన్ తన కుమారుడిని డెల్టా ఎయిర్ లైన్స్ లో టిక్కెట్టును బుక్ చేసుకొని అనంతరం వేరే విమానంలో లాస్ ఎంజెల్స్ లోకు పంపించేశారు. అతని కోసం బుక్ చేసిన సీటులో తన ఏడాది కుమారుడిని కూర్చోబెట్టాలనుకొన్నాడు. అది చూసిన విమాన సిబ్బంది చిన్న పిల్లాడికి మరో సీటు అవసరం లేదని ఆ సీటును వేరే ప్రయాణికుడికి ఇవ్వాలన్నారు.

Socal family thrown off overbooked Delta flight over child's seating

ఇందుకు బ్రయాన్ ఒప్పుకోలేదు. తాను సీట్ ను బుక్ చేసుకొన్నానని చెబుతూ సిబ్బంది వాదనకు దిగాడు. కావాలంటే తన కుటుంబాన్ని విమానం నుండి దించేసినా ఫర్వాలేదు.కానీ, తన కుమారుడికి మరోసీటు కావాల్సిందేనని పట్టుబట్టాడు.

దీంతో అధికారులు నువ్వు నీ భార్య జైల్లో ఉంటారు అంటూ వారిని విమానం నుండి దించేశారు. విమానంలో చిన్నపిల్లలకు కూడ సీట్లు బుక్ చేయాల్సిందేనని వారిని ఒడిలో కూర్చోబెట్టుకోవడం అంత శ్రేయస్కరం కాదన్నారు. ఇదివరకు ఫెడరల్ ఏవియేషన్ ఆడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది.

అయితే ఇక్కడ సమస్య ఒకరికోసం బుక్ చేసిన సీటులో వేరొకరిని కూర్చోబెట్టరు. దీంతో అది కాస్త వివాదానికి దారితీసింది.ఈ వివాదంపై డెల్టా ఎయిర్ లైన్స్ పై బ్రయాన్ కుటుంబానికి క్షమాపణ చెప్పింది.ఈ విషయమై దర్యాప్తు చేస్తామని ప్రకటించింది.

English summary
A Southern California family says they were kicked off an overbooked Delta airplane because they refused to yield a seat held by their young son.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X