వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీడియాతో పెట్టుకున్న ట్రంప్: గిచ్చి మరీ కయ్యం..

సీన్ స్పైసర్ అద్భుతమైన వ్యక్తి అని, కానీ ఫేక్ న్యూస్ మీడియా కారణంగా ఆయన అవమానాల పాలయ్యారని ట్రంప్ ఆరోపించారు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాదాల సహవాసానికి తెరపడటం లేదు. ముందు నుంచి మీడియాపై నెగటివ్ అభిప్రాయంతోనే ఉన్న ట్రంప్.. అదే ధోరణిని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. తాజాగా మరోసారి మీడియాను అనవసర వివాదంలోకి లాగారు.

వైట్ హౌజ్ ప్రెస్ సెక్రటరీ పదవికి రాజీనామా చేసిన తర్వాత సీన్ స్పైసర్ భవిష్యత్తు వెలిగిపోతుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలే ఈ వివాదానికి కారణమయ్యాయి. మీడియా వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యతల నుంచి తప్పుకోవడాన్ని భవిష్యత్తు వెలిగిపోవడంగా అభివర్ణించడాన్ని అక్కడి ప్రెస్ తప్పుపడుతోంది.

సీన్ స్పైసర్ రాజీనామా సందర్భంగా అతన్ని పొగుడుతూనే మీడియాపై ఆరోపణలు చేశారు ట్రంప్. సీన్ స్పైసర్ అద్భుతమైన వ్యక్తి అని, కానీ ఫేక్ న్యూస్ మీడియా కారణంగా ఆయన అవమానాల పాలయ్యారని ట్రంప్ ఆరోపించారు. ఫేక్ మీడియా అనవసరంగా స్పైసర్ ను దూషించిందని నోరు పారేసుకున్నారు.

ఇదే విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా కూడా వెల్లడించారు. శుక్రవారం వైట్ హౌజ్ సెక్రటరీ బాధ్యతల నుంచి స్పైసర్ తప్పుకున్న తర్వాత ఆయన స్థానంలో ఆంధోని స్కారముక్కీని వైట్ హౌజ్ కమ్యూనికేషన్ డైరెక్టర్ గా ట్రంప్ నియమించుకున్నారు.

కాగా, ట్రంప్ వ్యాఖ్యలపై మీడియా మండిపడుతోంది. మీడియాతో ఎలా మెలగాలో కూడా తెలియని వ్యక్తిని అద్భతమైన వ్యక్తి అని సంబోధించడానికి ప్రెస్ తప్పు పట్టింది.

English summary
White House press secretary Sean Spicer abruptly resigned Friday over President Donald Trump's decision to tap a camera-ready financier to lead the beleaguered White House communications team.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X