వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టాయ్‌లెట్ వాటర్‌తో 'బీర్': తాగినవాళ్లంతా సూపర్ అంటున్నారు..

అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన స్టోన్ బ్రీవింగ్ అనే బ్రీవరేజ్ సంస్థటాయిలెట్ వాటర్ ను రీసైక్లింగ్ చేసి 'బీర్' తయారుచేస్తోంది.

|
Google Oneindia TeluguNews

కాలిఫోర్నియా: భోజనం చేసేటప్పుడో.. ఇంకేవైనా ఆహార పానీయాలు సేవించేటప్పుడో 'టాయిలెట్'పేరెత్తితే చాలు.. తిన్నది కూడా బయటకు తన్నుకు వచ్చేస్తుందేమోనన్న ఫీలింగ్ కలుగుతుంది. అలాంటిది ఏకంగా 'టాయిలెట్' వాటర్ తోనే ఏదైనా పానీయం తయారుచేస్తే!.. వినడాకి ఎలా ఉన్నా.. దీన్ని టేస్ట్ చేసినవాళ్లు మాత్రం 'సూపర్ క్వాలిటీ' అంటూ పొగిడేస్తున్నారు.

అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన స్టోన్ బ్రీవింగ్ అనే బ్రీవరేజ్ సంస్థ ఈ ప్రయోగానికి తెరలేపింది. టాయిలెట్ వాటర్ ను రీసైక్లింగ్ చేసి 'బీర్' తయారుచేస్తోంది. ఈ తరహాలో తయారుచేసిన బీర్ ను ఇటీవలే కస్టమర్లకు తొలిసారిగా రుచిచూపించింది. స్థానికంగా జరిగిన ఓ ఈవెంట్ లో ఈ టాయిలెట్ వాటర్ బీర్ ను సర్వ్ చేశారు. ఈ కొత్త రకం బీర్ ను రుచి చూసినవాళ్లంతా ఆహా.. ఓహో.. అంటూ పొగిడేశారు.

Stone Brewing Creates Toilet to Tap Sewer Beer

టాయిలెట్ వాటర్ తో బీర్ ను తయారుచేయడం ప్రపంచంలో ఇదే తొలిసారని సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే దీన్ని తయారుచేశామని, ఎక్కడా క్వాలిటీ పోకుండా జాగ్రత్తపడ్డామని తెలిపారు.

సాధారణంగా రీసైక్లింగ్ చేసిన టాయ్ లెట్ వాటర్ ను గార్డెన్ వర్క్ కోసం ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. తొలిసారి ఇలా బీర్ తయారీ కోసం ఆ నీటిని ఉపయోగించారు. మరి ఇది మార్కెట్లోకి వస్తే మందుబాబులకు కిక్ ఇస్తుందా? లేక దీన్ని వాళ్లు తిరస్కరిస్తారా? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.

English summary
Stone Brewing is making beer from water that, to just quote them directly here, “comes from the toilet
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X