వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంత్యక్రియల్లో దిగంబర నృత్యాలు: నిషేధం

By Pratap
|
Google Oneindia TeluguNews

హందన్ (చైనా): రుడాలిల గురించి వినే ఉంటారు. మన దేశంలో ఎవరైనా చనిపోతే ప్రత్యేకంగా విలపించడానికి రుడాలిలను పిలిపిస్తారు. అయితే, చైనాలో మాత్రం ఎవరైనా చనిపోతే విషాదాన్ని మాయం చేసి, వారిని ఉల్లాసపరచడానికి చైనాలో ఓ ప్రత్యేకమైన కళాకారుల బృందం ఉంది.

అంత్యక్రియల్లో ఆ కళాకారులు బృందం దిగంబరంగా నృత్యాలు చేస్తూ బాధితులను ఉల్లాసపరుస్తారు. ఇటీవల జరిగిన అంత్యక్రియలకు సంబంధించిన చిత్రాలు చైనాలో హల్‌చల్ చేశాయి. జియాంగ్సు ప్రాంతంలోని మృతుడి కుటుంబసభ్యుల ముందు ఒంటిపైనున్న బట్టలు విప్పుతూ నృత్యకారులు దిగంబరంగా మారడంపై చైనా సాంస్కృతికశాఖ అభ్యంతరం వ్యక్తంచేసింది.

Strippers banned from Chinese funerals

స్థానిక సంస్కృతిని కలుషితం చేస్తున్న ఇలాంటి నృత్యాలపై నిషేధం విధించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చైనాలో ఇలాంటి కళాకారులు 2 వేల మందికి పైనే ఉంటారని, వారి ప్రదర్శన ఒక్కంటికి సుమారు 325 డాలర్లు చెల్లిస్తుంటారని సమాచారం.

చైనా గ్రామీణ ప్రాంతాల్లో మరణించినవారి ఆత్మకు శాంతి చేకూర్చడానికి, వారిని గౌరవించడానికి దిగంబర నృత్యాలను ఏర్పాటు చేయడం సంప్రదాయంగా వస్తోంది. వినోద వాణిజ్యానికి సంబంధించిన అవి సాంస్కృతిక విలువలను విచ్ఛిన్నం చేస్తున్నాయని చైనా అధికారులు అంటున్నారు. అది అనాగరికమని వ్యాఖ్యానిస్తున్నారు.

English summary
Strippers banned from Chinese funerals as authorities clamp down on bizarre erotic shows to honour the dead
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X