వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆనందోత్సాహం: తనలోని మరో కోణాన్ని చాటుకున్న ట్రంప్!(వీడియో)

ప్రజల మధ్యలో తాను ప్రసంగిస్తుండగా... జనాల్లో ఉన్న ఓ వ్యక్తిని వేదికపైకి పిలిచారు ట్రంప్. ఆయన పిలుపుకు వెంటనే స్పందించిన జీన్ హంబర్ అనే వ్యక్తి బారియర్స్‌పై నుంచి దూకి, వేదికపైకి వెళ్లాడు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో సంచలనంగా మారే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈసారి మాత్రం కొంత అనుకూల దోరణితో కనిపించారు. ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు, నిర్ణయాలను ప్రపంచంలోని చాలా దేశాలతోపాటు అమెరికన్లు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా, తనలోని మరో కోణాన్ని ట్రంప్ బయటపెట్టుకున్నారు.

తనను అభిమానించే వారిని గుండెల్లో పెట్టుకుంటానని చాటి చెప్పారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. ప్రజల మధ్యలో తాను ప్రసంగిస్తుండగా... జనాల్లో ఉన్న ఓ వ్యక్తిని వేదికపైకి పిలిచారు ట్రంప్. ఆయన పిలుపుకు వెంటనే స్పందించిన జీన్ హంబర్ అనే వ్యక్తి బారియర్స్‌పై నుంచి దూకి, వేదికపైకి వెళ్లాడు. అంతేగాక, ట్రంప్‌ను అభిమానంగా హత్తుకున్నాడు.

కాగా, ఈ చర్యను చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. హర్షాధ్వానాలతో వారి స్వాగతాన్ని తెలియజేశారు. ఒక సామాన్యుడు వచ్చి అధ్యక్షుడిని హత్తుకోవడమా? అంటూ సంభ్రమాశ్చర్యాలతో ఊగిపోయారు. అయితే, ఆ తర్వాత వారికి అసలు విషయం తెలిసింది.

జీన్ హంబర్ అనే ఆ వ్యక్తి డొనాల్డ్ ట్రంప్‌కు వీరాభిమాని. ట్రంప్ ఆరడుగుల కటౌట్‌ను తన ఇంట్లో పెట్టుకున్నాడు. ప్రతి రోజు ట్రంప్ కు ఆయన శాల్యూట్ చేస్తాడు. తనను గుర్తించిన తన అభిమాన నాయకుడు తనను వేదిక మీదకు పిలవడంతో హంబర్ ఎంతో సంతోషానికి గురయ్యాడు. ఎన్నికల సమయంలో తమ కోసం ఇచ్చిన హామీలను ట్రంప్ నిలబెట్టుకుంటారనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.

కాగా, ఓ కారు షోరూంలో హంబర్ సేల్స్ మెన్‌గా పని చేస్తున్నాడు. అయితే, కాకతాళీయంగా హంబర్ ను ట్రంప్ పిలిచారా? లేదా ఇది ముందుగానే ప్లాన్ చేసుకున్న వ్యవహారమా? అనే విషయం మాత్రం సందేహంగానే ఉండిపోయింది. అయితే, హంబర్‌కు మాత్రం ఒక్క ఈ ఘటనతో ఎక్కడాలేని ప్రచారం లభించింది.

English summary
President Trump invited an avid supporter of his to join him on stage during his rally Saturday at Melbourne, Fla. Trump invited the man to the stage, pointing to him mid-speech, saying he saw him on TV saying he loves the president.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X