వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

92ఏళ్ల బామ్మను నాలుగేళ్లుగా వేధించుకు తింటున్న ట్రంప్

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్ : రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ బాధితులంతా బయటకొస్తున్నారు. ఇప్పటికే పలువురు మహిళలు తమను లైంగికంగా వేధించారంటూ ప్రెస్ మీట్ లు పెట్టి మరీ ట్రంప్ పై ఆరోపణలు చేయగా.. తాజాగా ఓ 92ఏళ్ల బామ్మ కూడా ట్రంప్ పై ఆరోపణలు చేసింది. ట్రంప్ గోల్ఫ్ కోర్టుకు ఆనుకుని సదరు బామ్మ గారి ఇల్లు ఉండడంతో.. చాలాకాలంగా ఆ స్థలాన్ని తన గోల్ఫ్ కోర్టులో కలిపేసుకోవాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు ట్రంప్.

ఇందుకోసం గత నాలుగేళ్లుగా ఆ బామ్మతో పాటు ఆమె కుమారుడిని ట్రంప్ వేధింపులకు గురిచేస్తున్నారు. తాగేందుకు నీళ్లు కూడా లేకుండా చేయడమే కాకుండా ప్రతిరోజు బెదిరింపులతో తమకు కంటిమీద కునుకు లేకుండా చేశాడని బామ్మ వాపోయింది. స్కాట్ లాండ్ లోని అబర్డీన్ షైర్ లో గల ట్రంప్ 600 హెక్టార్ల లగ్జరీ గోల్ఫ్ కోర్టును ఆనుకుని బామ్మ గారి ఇల్లు ఉంది.

92ఏళ్ల మోలీ ఫోర్బ్స్ తన కుమారుడు మైఖేల్ ఫోర్బ్స్ తో కలిసి అందులో నివసిస్తోంది. తాము చెప్పిన రేటుకు ఇల్లు, వాకిలి తమకు అప్పగించి వెళ్లిపోవాల్సిందిగా ట్రంప్ అనుచరులు తమను బెదిరిస్తున్నట్లుగా మోలీ ఫోర్బ్స్ చెప్పారు. అయితే తమ ప్రాణాలు పోయినా సరే ఇల్లు ఖాళీ చేసేది లేదని మోలీ ఖరా ఖండిగా తేల్చేశారు.

The 92-year-old Scotswoman taking on Trump: Grandmother forced to drink stream

ఇల్లును అప్పగించడానికి నిరాకరించడంతో.. ఆగ్రహించిన ట్రంప్ అనుచరులు ఆమె ఇంటికి వెళ్లే నీటి పైపు లైన్ ను ధ్వంసం చేశారు. దీంతో ప్రస్తుతం మోలీ ఇంటికి నీటి సరఫరా నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్నారు. ట్రంప్ అనుచరులతో పైప్ లైన్ ను ధ్వంసం చేయడంతో.. ట్రంప్ మనుషులే దాన్ని పునర్మించాలని అధికారులు నోటీసులు సైతం జారీ చేసి ట్రంప్ అనుచరుల నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేకుండా పోయింది.

ఇక చేసేదేమిలేక.. గత నాలుగేళ్లుగా సమీపంలోని ఓ చిన్న చెరువు వద్దకు వెళ్లి నీటని తెచ్చుకుంటోంది మోలీ. ఇల్లు ఖాళీ చేయించడానికి ట్రంప్ ఆమెను తీవ్రంగా వేధించాడు. ఆ వేధింపుల్లో భాగంగా.. ఆమె బెడ్ రూమ్ కిటికీ ఎదుటే ఓ ఫ్లడ్ లైట్ ను కూడా ఏర్పాటు చేశారు. ఫ్లడ్ లైట్ వెలుతురుకు నిద్రపట్టక మోలీకి ఇబ్బందులు తప్పట్లేదు.

అయితే ఎంత వేధించినా సరే.. ట్రంప్ ఒత్తిళ్లకు తలవంచేది లేదంటోంది మోలీ. యూ హ్వావ్ బీన్ ట్రంప్డ్ టూ అనే డాక్యుమెంటరీ ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశారామె. స్కాట్ లాండ్ లో 90శాతం ప్రజలు ట్రంప్ కు వ్యతిరేకంగానే ఉన్నారని ఆమె చెప్పడం గమనార్హం. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే అమెరికా ప్రజలకు అంతకన్నా దౌర్బాగ్యం ఉండదంటూ అసహనం వ్యక్తం చేశారు.

కాగా, ఈ యూ హావ్ బీన్ ట్రంప్డ్ అనే డాక్యుమెంటరీని బ్రిటీష్ ఫిల్మ్ మేకర్ బాక్స్ టర్ నిర్మించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోగా ఈ డాక్యుమెంటరీని విడుదల చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లుగా ఆయన వెల్లడించారు. ఈ డాక్యుమెంటరీ ద్వారా మోలీకి న్యాయం చేయడం ఒకటైతే.. అలాంటి వ్యక్తిని అమెరికా అధ్యక్షునిగా ఎలా ఎన్నుకుంటారని ప్రశ్నించడం రెండో లక్ష్యమని ప్రకటించారు. కాగా, స్కాట్ లాండ్ ట్రంప్ తల్లిగారి ఊరు కావడంతో.. అక్కడ రెండు లగ్జరీ గోల్ఫ్ కోర్టులను నిర్మించాడు ట్రంప్.

English summary
A 92-year-old Scottish widow is forced to drink stream water she collects in a wheelbarrow because Donald Trump refuses to fix the damage caused by builders working on his £1billion golf course.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X