"క్యాబేజీ ఆకులతో సిగరెట్స్.."
న్యూయార్క్ : పొగాకుతో సిగరెట్స్ తయారు చేస్తారని తెలుసు గానీ.. కొత్తగా క్యాబేజీ ఆకులతో ఏంటీ? అనుకుంటున్నారా..! కొత్తగా ఏం కాదు, పాతదే. అయితే ఇదేదో ధూమపాన ప్రియుల కోసం కాదు.. సిగరెట్స్ తయారుచేసే ఉద్దేశంతో అంతకన్నా కాదు. జస్ట్ ఓ సినిమా కోసం.
అవును.. మొన్నీమధ్యే 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అమెరికన్ సినిమా 'స్టాండ్ బై మి' గురించి ఈ విషయమంతా. సినిమాలో ఓ టీనేజీ కుర్రాడితో సిగరెట్స్ తాగించడం పట్ల.. దర్శకుడు స్టీఫెన్ కింగ్ పై అప్పట్లో చాలానే విమర్శలు వచ్చాయి. అయితే ఇలాంటిదేదో జరుగుతుందని ముందే ఊహించిన దర్శకుడు.. తెలివిగా 'క్యాబేజీ ఆకుల'తో సిగరెట్స్ చేయించాడు.
కుర్రాడితో ధూమపానం చేయించారని విమర్శించిన వాళ్లంతా.. ఆ తర్వాత దర్శకుడు స్టీఫెన్ కింగ్ సమాధానం విని సైలెంట్ అయిపోయారు. సో.. ఇదన్న మాట.. 'క్యాబేజీ ఆకులతో సిగరెట్స్' కహానీ. అన్నట్టు.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అప్పట్లో మంచి విజయమే నమోదు చేసింది.