వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టైటానిక్: అవశేషాలు గుర్తించి 30 ఏళ్లు (వీడియో)

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: టైటానిక్ నౌక మొట్టమొదటి ప్రయాణమే చిట్టచివరి ప్రయాణం. ఇంగ్లాండు లోని సాథాంప్టన్ నుండి 1912 ఏప్రిల్ 10వ తేదిన టైటానిక్ నౌక న్యూయార్క్ నగరం వైపు బయలుదేరింది. అందులో మొత్తం 2,240 మంది ప్రయాణికులు ఉన్నారు.

ఏప్రిల్ 14వ తేది ఆదివారం రాత్రి 1,40 గంటల సమయంలో సముద్రంలో చలికి దాదాపు గడ్డకట్టుకుపోయే ఉష్టోగ్రత. కింద మంచు కొండలు ఉన్నాయని నౌక క్యాప్టెన్ స్మిత్ కు వైర్ లెస్ ద్వార సమాచారం అందింది. వెంటనే నౌకను దక్షిణం వైపు మళ్లించమని సిబ్బందికి సూచించారు.

అయితే ఉత్తర అమెరికాకు దక్షిణం వైపు ఉండే మంచు పర్వతాన్ని టైటానిక్ నౌక డీకొంది. ఆ సందర్బంలో నౌక రెండుగా ముక్కలు అయ్యింది. 1,522 మంది ప్రయాణికులు, సిబ్బంది జలసమాధి అయ్యారు. సముద్రంలో నౌక మునిగిపోయింది. అప్పటి నుండి టైటానిక్ అవశేషాల కోసం అన్వేషించారు.

the Titanic is one of the 20th century's great dramas, ship identified in 1985

వోడ్స్ హాల్ సముద్ర పరిశోధనా సంస్థకు చెందిన జీన్ లూయిస్ మైకెల్, రాబర్ట్ బ్లార్డ్ నేతృత్వంలోని బృందం 1985 సెప్టెంబర్ 1వ తేదిన సముద్రంలో రెండు మైళ్ల లోతులో టైటానిక్ అవేశాలు గుర్తించారు. నేటికి అవశేషాలు గుర్తించి 30 సంవత్సరాలు అయ్యింది.

టైటానిక్ ఆధారంగా అనేక సినిమాలు తీశారు. 1912లోనే రెండు సినిమాలు నిర్మించారు. అట్లాంటిక్ (1929), టైటానిక్ (1943), టైటానిక్ (1953), ఎ నైట్ టు రిమెంబర్ (1958), టైటానిక్ (1997) సినిమాలు నిర్మించారు. 1997లో నిర్మించిన టైటానిక్ సినిమాను 2010 తరువాత టైటానిక్ -3డిలో తెర మీదకు తీసుకు వచ్చారు.

English summary
Abraham Lincoln Saloman, a first class passenger, saved the menu after he escaped the doomed ship before it sank with the loss of 1,522 lives.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X