వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కడ ఉద్యోగం అంటే రాజభోగమే..! ఉద్యోగుల సంక్షేమంలో వరల్డ్ టాప్-5 దేశాలు

|
Google Oneindia TeluguNews

రోజుకు ఆరంటే ఆరు గంటల పని.. వారానికి ఐదు పనిదినాలు మాత్రమే. ఓవర్‌ టైమ్ అనేదానికి అక్కడ తావే లేదు. అసలు ఆ మాటే అక్కడ వినబడదు. వీకెండ్ సెలవులు కాకుండా, అదనంగా ఏడాదికి మరో 40 రోజులు వేతనంతో కూడిన సెలవులు దినాలు. పిల్లలు పుట్టిన దంపతులకు ఇద్దరికీ కలిపి తప్పనిసరిగా 480 రోజులు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలనేది అక్కడ ఖచ్చితంగా అమలయ్యే చట్టం. ఒకవేళ పుట్టింది కవలలు అయితే మరో 180 రోజులు సెలవులు అదనం. అది కూడా వేతనంతో కూడిన సెలవు దినాలు.

కార్మికులు ఎవరైనా అనారోగ్య కారణాలతో బాధపడేవారుంటే.. దాదాపు మూడు నెలల పాటు వేతనంతో కూడిన సెలవులను ఇస్తాయి అక్కడి కంపెనీలు. అలాగే ఉద్యోగుల పిల్లలను చదివించడానికయ్యే ఖర్చులను కూడా కంపెనీలే భరిస్తాయి. పనిచేసే చోట ఉద్యోగుల తిండి ఇతరత్రా ఖర్చులను భరించడమే కాకుండా సంవత్సరానికోసారి ఉద్యోగుల విహారయాత్రల కోసం కంపెనీ ఖాతాలోనే ప్రత్యేక ప్యాకేజీలను కూడా అందిస్తాయి. నైట్ డ్యూటీలు చేసే ఉద్యోగులకు ఆ దేశాలు రెట్టింపు వేతనంతో పాటు అదనపు సౌకర్యాలను కల్పిస్తాయి.

అసలు ఎలాంటి నైపుణ్యం లేని వ్యక్తులకైనా ఆ దేశాల్లో కనీసం రెండువేల డాలర్ల వరకు సంపాదించుకునే పనులు దొరుకుతాయి. ఇన్ని సకల సౌకర్యాలతో ఉద్యోగులను విశిష్ట అతిథిలా పోషిస్తున్న ఆ కంపెనీలు ఎక్కడున్నాయా.. అని ఆలోచిస్తున్నారా..! అయితే కింద ఉన్న జాబితా వైపు ఓ లుక్కేయండి..

ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచంలో భారీ మొత్తంలో కనీస వేతనాలు చెల్లిస్తున్న టాప్-5 దేశాలు... అక్కడి కనీస వేతనాల వివరాల జాబితా...

 top-5 countries in employee friendly

దేశం కనీస వేతనం

లగ్జెంబర్గ్ 2029 డాలర్లు (రూ.1,34,774)
నెదర్లాండ్స్ 1918 డాలర్లు (రూ.1,27,401)
బెల్జియం 1800 డాలర్లు (రూ.1,19,563)
ఫ్రాన్స్ 1707 డాలర్లు (రూ.1,13,385)
బ్రిటన్ 1657 డాలర్లు (రూ. 1,10,064)

English summary
those countries are providing luxury facilities and more holidays with pay leave for their employees
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X