వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేమేదో అనుకున్నాం కానీ.. ఉత్తర కొరియా మహా డేంజర్: అమెరికా ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్

ఉత్తర కొరియాపై అమెరికా అంచనాలు ఇప్పుడిప్పుడే మారుతున్నాయి. దీనికి ఉదాహరణ.. తాజాగా ఆ దేశ ఆర్మీ స్టాఫ్ చీఫ్ చేసిన వ్యాఖ్యలే. తాము ఊహించిన దానికంటే ప్రమాదకరంగా ఉత్తర కొరియా ఉన్నట్లు అమెరికా ఆర్మీ.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

జెనీవా: ఉత్తర కొరియాపై అమెరికా అంచనాలు ఇప్పుడిప్పుడే మారుతున్నాయి. దీనికి ఉదాహరణ.. తాజాగా ఆ దేశ ఆర్మీ స్టాఫ్ చీఫ్ చేసిన వ్యాఖ్యలే. తాము ఊహించిన దానికంటే ప్రమాదకరంగా ఉత్తర కొరియా ఉన్నట్లు అమెరికా ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ మార్క్ మిల్లీ వ్యాఖ్యానించారు.

వాషింగ్టన్‌ డీసీలోని నేషనల్‌ ప్రెస్‌ క్లబ్‌లో ఈ విషయాన్ని నొక్కి చెబుతూ ఇప్పటికీ ఉత్తర కొరియాపై సైనిక చర్య తీసుకోకుండానే సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉందని, అయితే, ఆ సమయం కాస్తా ముగిసిపోతోందని మిల్లీ తెలిపారు.

అది అత్యంత వేగం కలిగిన క్షిపణి...

అది అత్యంత వేగం కలిగిన క్షిపణి...

ఇప్పటి వరకు ఉత్తర కొరియా ఎన్నో రకాల క్షిపణులను పరీక్షించింది. ఒకవైపు అమెరికా హెచ్చరిస్తున్నా.. మరోవైపు ఐక్యరాజ్య సమితి వారిస్తున్నా అది లెక్కచేయలేదు. అయితే ఇప్పటి వరకు పరీక్షించిన అణ్వస్త్రాలన్నిటికంటే.. ఈనెల 4న ఉత్తర కొరియా పరీక్షించిన ఖండాంతర క్షిపణి చాలా వేగవంతమైందట. దానిని అత్యాధునిక పరిజ్ఞానం కలిగిన, ఊహకందని క్షిపణిగా అమెరికా రక్షణ శాఖ అధికారులే అభివర్ణిస్తున్నారంటే.. దాని శక్తి సామర్థ్యాలు ఏపాటివో మనం ఊహించుకోవచ్చు.

Recommended Video

Sikkim stand-off : India is a force to reckon with US diplomat advice China | Oneindia News
రోజులు గడిచేకొద్దీ మరింత ప్రమాదం...

రోజులు గడిచేకొద్దీ మరింత ప్రమాదం...

‘రోజులు గడిచేకొద్దీ ఉత్తర కొరియా చాలా ప్రమాదకరంగా పరిణమిస్తోందని, వారాలు మారే కొద్దీ అది ప్రమాదానికే ప్రమాదంగా మారుతోందంటూ అమెరికా ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ మార్క్ మిల్లీ ఆందోళన వ్యక్తం చేశారు. వాషింగ్టన్‌ డీసీలోని నేషనల్‌ ప్రెస్‌ క్లబ్‌లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా రక్షణ శాఖ అధికారులు చెబుతున్న విషయాలు గమనిస్తే.. ఉత్తర కొరియా కూడా తక్కువ తినలేదని అర్థమవుతోంది.

యుద్ధమంటూ వస్తే.. భీకరమే!

యుద్ధమంటూ వస్తే.. భీకరమే!

ఒకవేళ ఉత్తరకొరియా, అమెరికా నడుమ యుద్ధం గనుక సంభవిస్తే.. అది ఎవరూ ఊహించని విధంగా భయంకరంగా ఉండబోతోందనే సంకేతాలు అందుతున్నాయి. ఎందుకంటే... అమెరికాతో అలాంటి పరిస్థితే గనుక ఎదురైతే.. ఉత్తర కొరియా కచ్చితంగా అణ్వాయుధాలను రంగంలోకి దించక మానదు. ఉత్తర కొరియా వ్యూహాలపై అమెరికా మిలిటరీ అధికారులు కూడా ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు. అందుకే అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అత్యాధునిక థాడ్ క్షిపణి వ్యవస్థను దక్షిణ కొరియాకు చేర్చడమేకాక, తమ యుద్ధ నౌకలను కూడా సంసిద్ధంగా ఉంచారు.

కచ్చితంగా ఆ క్షిపణిని ప్రయోగిస్తుందా?

కచ్చితంగా ఆ క్షిపణిని ప్రయోగిస్తుందా?

ఒకవేళ యుద్ధమంటూ సంభవిస్తే... కచ్చితంగా ఉత్తరకొరియా తాను రూపొందించిన ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్( ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి) లను రంగంలోకి దించుతుందని కూడా అమెరికా రక్షణ శాఖ అధికారులు భావిస్తున్నారు. అది కూడా తాము ఊహించిన సమయం కంటే చాలా ముందుగానే వాటిని ఉత్తరకొరియా రంగంలోకి దించే అవకాశం ఉందని కూడా వారు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయమై ఇ‍ప్పటికే అమెరికా డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం (డీఐఏ) కూడా హెచ్చరించినట్లు అమెరికా ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ మార్క్ మిల్లీ వెల్లడించారు.

అమెరికా సేనల ముందు నిలవగలదా?

అమెరికా సేనల ముందు నిలవగలదా?

అయితే ఉత్తర కొరియా సత్తా ఎంత? ఒకవేళ అమెరికాతో యుద్ధమే గనుక వస్తే.. అది అమెరికా మహాసైన్యం ముందు నిలవగలదా? ఎన్ని రోజులు యుద్ధం చేయగలదు? ఇదే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఐక్యరాజ్య సమితిలోని అమెరికా రాయబారి నిక్కీ హేలీ మాట్లాడుతూ ఉత్తర కొరియాపై దాడి చేయడానికి అమెరికా కూడా సిద్ధంగానే ఉందని, అయితే అలాంటి పరిస్థితి ఏర్పడదనే తాము భావిస్తున్నామని చెప్పారు. అమెరికా సేనల ముందు ఉత్తరకొరియా నిలవలేదని కూడా ఆమె పేర్కొన్నారు.

English summary
U.S. General Mark Milley, the chief of staff of the Army, said on Thursday that North Korea's July 4 test of an intercontinental ballistic missile showed its capabilities were advancing significantly and faster than many had expected. Milley, in remarks to the National Press Club in Washington, said there was still time for a non-military solution to the crisis caused by North Korea's nuclear and missile programs, but cautioned that "time is running out." "North Korea is extremely dangerous and more dangerous as the weeks go by," he said. U.S. media reported this week that the Defense Intelligence Agency (DIA), the Pentagon spy agency, had assessed that North Korea would be able to field a nuclear-capable ICBM by next year, earlier than previously thought.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X