వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవసరమైతే ఉత్తరకొరియా సర్వనాశనం, సహనం పరీక్షించొద్దు: ట్రంప్ తీవ్ర హెచ్చరిక

ఉత్తర కొరియాను సమూలంగా నాశనం చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ఆ దేశ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఐక్య రాజ్య సమితి 72వ సర్వ సభ్య సమావేశం మంగళవారం ప్రారంభమైంది. వివిధ దేశాల నుంచి ఈ భేటీకి హ

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఉత్తర కొరియాను సమూలంగా నాశనం చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ఆ దేశ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఐక్య రాజ్య సమితి 72వ సర్వ సభ్య సమావేశం మంగళవారం ప్రారంభమైంది. వివిధ దేశాల నుంచి ఈ భేటీకి హాజరైన ప్రతినిధులను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు.

హెచ్1బి వీసాలు: భారత టెక్కీలకు ట్రంప్ ఊరట, లేదంటే ఫీజు వాపస్హెచ్1బి వీసాలు: భారత టెక్కీలకు ట్రంప్ ఊరట, లేదంటే ఫీజు వాపస్

ఐరాస వేదికపై ఆయన మాట్లాడటం ఇది తొలిసారి. ఈ సందర్భంగా ఉత్తర కొరియా కిమ్ జాంగ్ ఉన్‌ను రాకెట్ మ్యాన్‌గా పేర్కొన్నారు. తక్షణం అణు క్షిపిణుల తయారీని నిలిపివేయాలని హెచ్చరించారు.

సహనం పరీక్షించొద్దు, నాశనం చేస్తాం

సహనం పరీక్షించొద్దు, నాశనం చేస్తాం

అమెరికా సహనాన్ని పరీక్షించవద్దని ట్రంప్ ఉత్తర కొరియాను హెచ్చరించారు. ఏకపక్షంగా అణుపరీక్షలు నిర్వహిస్తూ, మానవాళి మొత్తానికి ముప్పుగా పరిణమిస్తున్న ఆ దేశం రెచ్చగొట్టే వైఖరిని మానుకోకపోతే ఆ దేశాన్ని సర్వ నాశనం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని తీవ్రంగా స్పందించారు.

భవిష్యత్తు అనేది

భవిష్యత్తు అనేది

అన్ని అవకాశాలూ తమ పరిశీలనలో ఉన్నాయని ఉత్తర కొరియాను ఉద్దేశించి ట్రంప్ చెప్పారు. అణు నిరాయుధీకరణతోనే భవిష్యత్తు అనేది ఉత్తర కొరియా గ్రహించాలన్నారు. ఆంక్షలు విధించడానికి మద్దతుగా నిలిచిన దేశాలకు ట్రంప్‌ కృతజ్ఞతలు చెప్పాు. ఆ దేశాన్ని ఏకాకిని చేయడానికి అన్ని దేశాలూ కలిసి ముందుకు రావాలన్నారు.

ఈ దేశాలు సహకరిస్తున్నాయి

ఈ దేశాలు సహకరిస్తున్నాయి

అణ్వాయుధాలు ఉన్న దేశాలు ముప్పుగా పరిణమిస్తున్నాయని ట్రంప్ చెప్పారు. ఐక్య రాజ్య సమితిలో ప్రతినిధులుగా ఉన్న కొన్ని ధూర్త దేశాలు ఉగ్రవాదానికి మద్దతునివ్వడమే కాకుండా ఇతర దేశాలను బెదిరిస్తున్నాయని, అత్యంత వినాశకర ఆయుధాలతో తమ సొంత ప్రజల్నీ అవి బెదరగొడుతున్నాయని మండిపడ్డారు.

ఉత్తర కొరియాను నాశనం చేయడం మినహా మరో దారి లేదు

ఉత్తర కొరియాను నాశనం చేయడం మినహా మరో దారి లేదు

అమెరికాకు గొప్ప బలం, అపారమైన సహనం ఉన్నాయని ట్రంప్ అన్నారు. తమను తాము రక్షించుకోవాల్సి వచ్చినప్పుడు, లేదా తమ మిత్రదేశాల కోసం తప్పనిసరైతే ఉత్తర కొరియాను పూర్తిగా నాశనం చేయడం మినహా తమకు మారో మార్గం లేదని హెచ్చరించారు.

రాకెట్ మనిషి అంటూ కింగ్ జాంగ్ ఉన్‌ను

రాకెట్ మనిషి అంటూ కింగ్ జాంగ్ ఉన్‌ను

రాకెట్‌ మనిషి (కిమ్‌ జాంగ్‌ ఉన్‌) తనను, తన పాలనను అంతమొందించుకునేందుకు సిద్ధమవుతున్నాడని ట్రంప్ అన్నారు. ఈ విషయంలో అమెరికా అన్నివిధాలా సిద్ధంగానే ఉన్నా అంత అవసరం రాదని తాను నమ్ముతున్నానని చెప్పారు. మొత్తానికి ఉత్తర కొరియాకు గతంలో కంటే తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

ఇరాన్ పైనా..

ఇరాన్ పైనా..

అదే సమయంలో ఇరాన్‌ చేపట్టిన ప్రాణాంతక ఆయుధ కార్యక్రమంపై తమకు ఘర్షణ తప్పదని కూడా ప్రకటించారు. 2015లో ఆరు దేశాలకు, ఆ దేశానికి మధ్య కుదిరిన ఒప్పందానికి చెల్లుచీటీ రాయాల్సి వస్తుందని ట్రంప్ సంకేతాలిచ్చారు. ఘర్షణలను నిలువరించడంలో ఈ ఒప్పందం విఫలమయిందనీ, ఒప్పందాన్ని ఇరాన్‌ ఉల్లంఘించిందన్న విషయాన్ని వచ్చేనెలలో కాంగ్రెస్‌కు తాను నివేదిక ఇచ్చేటప్పుడు ప్రకటిస్తానన్నారు. ప్రమాదకరమైన క్షిపణుల్ని రూపొందిస్తూ అస్థిరపరిచే కార్యకలాపాలకు పాల్పడుతున్నవారిని చూస్తూ వదిలేయలేమన్నారు.

English summary
President Donald Trump, in his first address to the United Nations, derided Kim Jong Un, North Korea’s leader, as a “rocket man” on Tuesday as the president warned that he may be forced to "totally destroy" the rogue nation. "If the righteous many do not confront the wicked few, then evil will triumph," Trump said, as he detailed the horrors of what he called the "depraved" North Korean regime.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X