వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షట్టర్ క్లోజ్!: 'ట్రంప్ మోడల్స్' ఏజెన్సీ మూసివేత..

మేనేజర్ ఒకరు సంస్థ నుంచి బయటకు వెళ్లిపోవడం, అతనితో పాటే చాలామంది మోడల్స్ ఏజెన్సీని వీడటం కూడా దీనికి కారణంగా తెలుస్తోంది. వారంత సదరు మేనేజర్ ఏజెన్సీలో చేరినట్లు చెబుతున్నారు.

|
Google Oneindia TeluguNews

లాస్ ఏంజిల్స్: 1999లో ప్రారంభమైన ట్రంప్ మోడల్స్ మూతపడింది. ఈ విషయాన్ని మోడలింగ్ ఏజెన్సీ వర్గాలు అధికారింగా మీడియాకు వెల్లడించాయి. ట్రంప్ కుటుంబానికి చెందిన ఈ మోడలింగ్ ఏజెన్సీ నుంచి చాలా మంది మోడల్స్ ఉన్నత స్థానానికి చేరుకున్నారు.

అయితే గత కొంతకాలంగా ట్రంప్ మోడల్ ఏజెన్సీకి తగినన్ని ప్రాజెక్టులు రాకపోవడంతోనే మూసివేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఏజెన్సీలో పనిచేసే మేనేజర్ ఒకరు సంస్థ నుంచి బయటకు వెళ్లిపోవడం, అతనితో పాటే చాలామంది మోడల్స్ ఏజెన్సీని వీడటం కూడా దీనికి కారణంగా తెలుస్తోంది. వారంత సదరు మేనేజర్ ఏజెన్సీలో చేరినట్లు చెబుతున్నారు.

 trumps modeling agency shuts down

మొత్తం మీద ఏళ్లుగా మోడలింగ్ రంగంలో తనదైన ముద్ర వేసిన 'ట్రంప్ మోడల్స్' ఏజెన్సీ ఇక తిరిగి తెరుచుకునే అవకాశాలు కూడా కనిపించడం లేదు. 'సంస్థను మూసివేయడం మాకు చాలా బాధ కలిగించింది. కానీ ఇంతకన్నా వేరే మార్గం కనిపించలేదు. కానీ మా సంస్థ తరుపున గొప్ప సేవలు అందించాం' అంటూ ట్రంప్ మోడల్ కు చెందిన ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు.

English summary
The modeling agency founded by the Trump Organization is shuttering according to a source in the New York-based office, who confirmed the news Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X