వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిర్ ఏషియా ఆచూకీ లభ్యం: జావా సముద్రంలో కూలింది!

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఇండోనేషియా: 162 మందితో ఇండోనేషియా నుండి సింగపూర్ వెళ్తూ అదృశ్యమైన ఎయిర్ ఏషియా విమానం కోసం గాలిస్తున్నారు. ఆదివారం ఉదయం ఈ విమానం అదృశ్యమైన విషయం తెలిసిందే. ఈ విమానం అచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. విమానం అదృశ్యమై 24 గంటలు గడిచినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో బంధువుల్లో ఆందోళన నెలకొంది.

విమానంలో 155 మంది ప్రయాణీకులు, 7గురు సిబ్బంది ఉన్నారు. ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా దేశాలు వైమానిక, నావికా దళాలతో గాలిస్తున్నాయి. మరోవైపు, విమానం సముద్రంలో కూలిపోయి ఉంటుందని అధికారులు కొందరు భావిస్తున్నారు. విమానం కూలినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించికున్నారని తెలుస్తోంది. జావా సముద్రంలో విమాన శకలాలు గుర్తించినట్లు ఆస్ట్రేలియా ప్రకటించింది. దీనిని ఇండోనేషియా ధృవీకరించింది.

కాగా, మార్చి 8న ఎంహెచ్ 370 విమానం అదృశ్యమైన విషయం తెలిసిందే. ఈ ఏడాది పలు విమాన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అయితే, ఎంహెచ్ 370 విమానం ఆచూకీ ఇప్పటి వరకు దొరకలేదు. దానిలాగే ఇప్పుడు ఈ ఎయిర్ ఏషియా విమానం అచూకీ కూడా దొరకక పోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ రెండు విమానాలు అదృశ్యమైన కాసేపటికే వాతావరణం అనుకూలించలేదు. అలాగే ఏటీసీతో సంబంధం తెగిపోయింది.

ఎయిర్ ఏషియా

ఎయిర్ ఏషియా

ఎయిర్ ఏషియా క్యూజెడ్ 8501 విమానంలో ఉన్న వారి బంధువులు సురభయలోని జౌండా ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో రోదిస్తున్న దృశ్యం.

ఎయిర్ ఏషియా

ఎయిర్ ఏషియా

ఎయిర్ ఏషియా గ్రూప్ సీఈవో టోనీ ఫెర్నాండేస్ ఆదివారం నాడు సురభయలోని జౌండా ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో ...

ఎయిర్ ఏషియా

ఎయిర్ ఏషియా

మార్చి 8న ఎంహెచ్ 370 విమానం అదృశ్యమైన విషయం తెలిసిందే. ఈ ఏడాది పలు విమాన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అయితే, ఎంహెచ్ 370 విమానం ఆచూకీ ఇప్పటి వరకు దొరకలేదు.

ఎంహెచ్ 370

ఎంహెచ్ 370

దానిలాగే ఇప్పుడు ఈ ఎయిర్ ఏషియా విమానం అచూకీ కూడా దొరకక పోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ రెండు విమానాలు అదృశ్యమైన కాసేపటికే వాతావరణం అనుకూలించలేదు. అలాగే ఏటీసీతో సంబంధం తెగిపోయింది.

English summary
Indonesia AirAsia Flight 8501, an Airbus A320 airliner carrying 162 people, disappeared from radar screens early Sunday, about 40 minutes after leaving the Indonesian city of Surabaya en route to Singapore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X