వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుద్ధమేఘాలు: ద‌క్షిణ కొరియాకు చేరిన ‘థాడ్’ మిస్సైళ్లు, యుద్ధనౌకలు, పరిస్థితి ఉద్రిక్తం..

కొరియా దేశాల్లో యుద్ధ మేఘాలు క‌మ్ముకుంటున్నాయి. అమెరికాకు చెందిన అత్యంత పటిష్టవంతమైన, శక్తివంతమైన థాడ్ మిస్సైల్ వ్య‌వ‌స్థ కూడా బుధవారం ద‌క్షిణ కొరియాకు చేరుకుంది. మరోవైపు యుద్ధ నౌకల ప్రవేశంతో పరిస్థ

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

సియోల్: కొరియా దేశాల్లో యుద్ధ మేఘాలు క‌మ్ముకుంటున్నాయి. అమెరికాకు చెందిన వివాదాస్ప‌ద థాడ్ మిస్సైల్ వ్య‌వ‌స్థ ద‌క్షిణ కొరియాకు చేరుకుంది. క్షిప‌ణి వ్య‌వ‌స్థ‌లో థాడ్‌కు ప్ర‌త్యేక స్థానం ఉంది. ఇది అత్యంత ప‌టిష్ట‌మైన వ్య‌వ‌స్థ‌.

ఒకవైపు ఉత్తర కొరియా మాటిమాటికీ క‌వ్వింపు చర్యల‌కు దిగుతున్న నేప‌థ్యంలో అమెరికా త‌న బ‌ల‌మైన మిసైల్ వ్య‌వ‌స్థ‌ను దక్షిణ కొరియాకు తీసుకువ‌చ్చింది. ఆ మిసైల్ వ్య‌వ‌స్థ‌కు సంబంధించిన వాహ‌నాలు సియోల్‌కు ద‌క్షిణంగా 250 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి బుధవారమే చేరుకున్నాయి.

థాడ్ క్షిపణి వ్యవస్థ రాక...

థాడ్ క్షిపణి వ్యవస్థ రాక...

డిఫెన్స్ వాహ‌నాల్లో మిస్సైల్స్‌ను తీసుకువ‌చ్చారు. థాడ్ క్షిప‌ణులు రావ‌డాన్ని స్థానిక కొరియా ప్ర‌జ‌లు వ్య‌తిరేకించారు. ఈ నేపథ్యంలో వాహ‌నాల‌ను తీసుకువ‌స్తున్న రోడ్డు వెంట భారీ సంఖ్య‌లో పోలీసుల‌ను మోహ‌రించారు. ఆందోళ‌న‌కారుల‌కు, పోలీసుల‌కు మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో ప‌దిమంది గాయ‌ప‌డ్డారు.

ఉత్తర కొరియాకు బుద్ధి చెప్పేందుకే...

ఉత్తర కొరియాకు బుద్ధి చెప్పేందుకే...

ఉత్తర కొరియా ప‌దేప‌దే చేస్తున్న మిసైల్ బెదిరింపుల‌ను ఎదుర్కొనేందుకు అమెరికా థాడ్ వ్య‌వ‌స్థ‌ను రంగంలోకి దించాల్సి వ‌చ్చింది. మరోవైపు థాడ్ మిస్సైళ్ల వ‌ల్ల కొరియా ప్రాంతంలో భ‌ద్ర‌త బ‌ల‌హీన‌మ‌వుతుంద‌ని చైనా ఇప్ప‌టికే హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.

యుద్ధ నౌకల మోహరింపు...

యుద్ధ నౌకల మోహరింపు...

ఉత్తర కొరియా మ‌రికొన్ని అణు, మిస్సైల్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాలని ప్ర‌య‌త్నిస్తున్న నేప‌థ్యంలో వివాదాస్ప‌ద కొరియా ద్వీప‌క‌ల్పానికి అమెరికా త‌న యుద్ధ‌నౌక‌ల‌ను కూడా పంపిస్తోంది. యుద్ధ నౌక‌లు మోహ‌రించ‌డంతో ప్ర‌స్తుతం తూర్పు ఆసియా ప్రాంతంలో ఉద్రిక్త‌ వాతావ‌ర‌ణ నెల‌కొంది.

తొలి దశలోనే ధ్వసం...

తొలి దశలోనే ధ్వసం...

స్వ‌ల్ప‌, మ‌ధ్య శ్రేణి క్షిప‌ణుల‌ను థాడ్ మిసైల్ వ్య‌వ‌స్థ మొద‌టి ద‌శ‌లోనే ధ్వంసం చేస్తుంది. ఉత్తర కొరియా దూకుడును అడ్డుకునేందుకే అమెరికా థాడ్ వ్య‌వ‌స్థ‌ను తీసుకువ‌చ్చిన‌ట్లు ద‌క్షిణ కొరియా ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ‌ వెల్ల‌డించింది.

అప్రమత్తమైన చైనా...

అప్రమత్తమైన చైనా...

మరోవైపు చైనా కూడా స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో త‌యారుచేసిన యుద్ధ‌నౌక‌ను ఇవాళే జ‌ల‌ప్ర‌వేశం చేయించింది. దీంతో ప‌రిస్థితి మ‌రింత ఉద్రిక్తంగా మారింది. ఇప్పటికే అమెరికాకు చెందిన జలాంతర్గామి యూఎస్ఎస్ మిచిగన్, యుద్దనౌక కార్ల్ విన్సన్ కూడా కొరియా ద్వీపకల్పానికి చేరుకున్నాయి.

English summary
Seol: The U.S. military started moving parts of an anti-missile defense system to a deployment site in South Korea on Wednesday, triggering protests from villagers and criticism from China, amid tension over North Korea's weapons development. The top U.S. commander in the Asia-Pacific, Admiral Harry Harris, told the U.S. Congress that the Terminal High Altitude Area Defense (THAAD) system would be operational "in coming days." The earlier-than-expected steps to deploy system were denounced both by China, and the frontrunner in South Korea's presidential election on May 9.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X