వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తారా జువ్వలా దూసుకొచ్చి.. వివాదాల్లో అప్రతిష్ఠ పాలు.. ఒడిదొడుకుల ఉబర్ యానం

అంతర్జాతీయంగా ఆగమేఘాల మీద అభివృద్ధిలో అంగలు వేస్తున్న అంకుర కంపెనీగా ఉబర్‌కున్న పేరు వివాదాలతో మసకబారింది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

ముంబై/ బెంగళూరు: అంతర్జాతీయంగా ఆగమేఘాల మీద అభివృద్ధిలో అంగలు వేస్తున్న అంకుర కంపెనీగా ఉబర్‌కున్న పేరు వివాదాలతో మసకబారింది. సమస్యల సుడిగండంలో చిక్కుకుని గిలగిలలాడుతున్న ఉబర్‌కు కొత్త జీవం పోసేందుకు భారీ ప్రణాళిక అమలు జరుగుతున్న వేళ వ్యవస్థాపకుడు, సీఈవో వైదొలగడం కీలక పరిణామం.

విశిష్ట అంకుర కంపెనీకి నారుపోసి నీరుపోసి పెంచిన ట్రావిస్ కలానిక్ ఆ కంపెనీ సంక్షేమం కోసమే పక్కకు జరుగడం వైపరీత్యంగా కనిపించవచ్చు. కానీ ఇన్వెస్టర్లు గట్టిగా పట్టుబట్టడంతో ఆయన ఇంటిదారి పట్టక తప్పలేదు. తల్లిని కోల్పోయిన దుఃఖం ఒకవైపు, కంపెనీని చుట్టుముట్టిన సమస్యలు ఇంకోవైపు.. వెరసి అంకుర కంపెనీల ధృవతారగా వెలుగొందిన కలానిక్ అప్రతిష్ఠాకరమైన పరిస్థితుల్లో సారథ్యం నుంచి తప్పుకున్నారు.

ప్రపంచానే మార్చేసిన ఉబర్

ప్రపంచానే మార్చేసిన ఉబర్

ఒక చిన్న ఐడియా ప్రపంచాన్ని మార్చేస్తుంది అన్న నానుడిని అక్షరాలా నిజం చేసిన అంకుర కంపెనీ ఉబర్. యాప్ ఆధారిత క్యాబ్ కంపెనీకి మారుపేరుగా నిలిచింది. కొద్దిమందితో, పిడికెడు పెట్టుబడితో మొదలై ఎనిమిదేండ్లలో 7000 కోట్ల డాలర్ల (భారతీయ కరెన్సీలో రూ.4.76 లక్షల కోట్లు) కంపెనీగా ఎదిగి చరిత్ర సృష్టించింది. సొంతంగా ఒక్క క్యాబ్ కూడా లేకుండా క్యాబ్‌ రంగంలో విశ్వకంపెనీగా అవతరించింది. 76 దేశాల్లో కోట్లమందికి సేవలందించింది. లక్షల మందికి ఉపాధిని కల్పించింది.

రెచ్చిపోయిన చిచ్చర పిడుగు

రెచ్చిపోయిన చిచ్చర పిడుగు

కలానిక్ పుట్టింది లాస్ ఏంజెల్స్‌లో. చదివింది యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజెల్స్ క్యాంపస్‌లో. ఇంజినీరింగ్ చదువు మధ్యలో ఆపేసి వ్యాపారంలోకి దిగారు. 1998లో ప్రారంభించిన తొలి స్టార్టప్ తుస్సుమన్నది. రెండోది 2007లో లాభానికి అమ్మేశారు. గారెట్ క్యాంప్ అనే మిత్రుడు ట్యాక్సీలను పట్టుకోవడంలో ఇబ్బందుల గురించి చెప్తే యాప్ ఐడియా వచ్చింది.

ఇద్దరూ కలిసి 2010లో ఉబర్ క్యాబ్ కంపెనీ స్థాపించారు. తర్వాత న్యాయపరమైన చిక్కుల కారణంగా క్యాబ్ తొలగి, ఉత్త ఉబర్ మిగిలింది. ఆ ఏడాది చివరనే కలానిక్ సీఈవో బాధ్యతలు చేపట్టారు. అమెరికాలోని ట్యాక్సీ కంపెనీల గుత్తాధిపత్యంపై ప్రచారం చేపట్టి కలానిక్ తన క్యాబ్ సామ్రాజ్యానికి పునాదులు వేశారు. వ్యాపారంతోపాటే వివాదాలు పెచ్చరిల్లాయి. అనేక నగరాల్లో నిషేధాలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఉబర్ ట్యాక్సీరంగంలో ఒక తుఫాను

ఉబర్ ట్యాక్సీరంగంలో ఒక తుఫాను

స్మార్ట్‌ఫోన్ల రాక, మధ్యతరగతి సంపద వృద్ధి ఉబర్‌కు కలిసివచ్చింది. ఫోన్‌లో క్లిక్ చేస్తే చాలు క్యాబ్ మీ ముంగిట సిద్ధం అనేది నినాదంగా మారింది. అనుసంధాన వ్యాపారం ఇంటింటి మాటగా మారింది. ఉబర్ కూడా కొత్త, కొత్త రంగాలకు విస్తరించింది. యాప్ ద్వారా హెలికాప్టర్ రప్పించుకుని మొదలు ఆర్డరు చేస్తేకుక్కపిల్ల సరఫరా వంటి కొత్తరకం సేవలను ప్రవేశపెట్టింది. కలానిక్ డోన్ట్‌కేర్ తరహా వైఖరి కంపెనీ సక్సెస్‌కు దోహద పడింది.

సమస్యలకు కొదువ లేదు

సమస్యలకు కొదువ లేదు

డ్రైవర్ల ఫిర్యాదులు, సమ్మెలు, గొడవలు ఉబర్‌ను వెంటాడటం మొదలైంది. ఇవన్నీ ఒక ఎత్తు.. మహిళలకు ఉబర్ కంపెనీలో తగిన రక్షణ లేదని వచ్చిన ఆరోపణలు మరొక ఎత్తు. కంపెనీ సంపద తారాస్థాయికి చేరుకున్న 2017లో వివాదాల సెగ కూడా ఎక్కువైంది. కంపెనీలో లైంగిక వేధింపుల గురించి ఉబర్ మాజీ ఇంజినీరు సూజన్ ఫోలర్ బయటపెట్టడంతో పరువు గంగలో కలిసింది. ఒక్కొక్కరుగా సంస్థ అధికారులు రాజీనామా చేస్తూ పోయారు. అమెరికా న్యాయశాఖ కంపెనీ వాడే సాఫ్ట్‌వేర్‌పై దర్యాప్తు మొదలుపెట్టింది. రోజురోజకూ ఉబర్ పతనం దిశగా ప్రయాణిస్తుండడంతో ఇన్వెస్టర్లు ఇక చాలు అని చెప్పేశారు.

English summary
MUMBAI/ BENGALURU:Uber's public relations crises and management shakeups is affecting how the public looks at the service. "There's a negative perception – there's no other way to look at this," said Frank Zaccanelli, CEO of marketing consulting firm Fiamma Partners. "The average consumer is concerned that there's too much turmoil going on in the company and might have reservations about using the company's services."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X