వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ: బంగ్లాదీ అదే వాదన

|
Google Oneindia TeluguNews

ఢాకా: పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. పాక్‌ను ఉగ్రదేశంగా ప్రకటించాలని ఇప్పటికే భారత్ డిమాండ్ చేస్తోంది. దీనికి ఇతర దేశాల మద్దతు కూడా లభిస్తోంది. తాజాగా బంగ్లాదేశ్ కూడా మన దాయాదికి షాకిచ్చింది.

ఐక్య రాజ్య సమితి పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని బంగ్లాదేశ్‌ దౌత్య అధికారి కోరారు. సార్క్‌ చరిత్రలోనే తొలిసారి ఎనిమిది దేశాల్లో నాలుగు దేశాలు సమావేశానికి హాజరు కావడానికి నిరాకరించడం చాలా తీవ్రమైన అంశమని ఆయన అన్నారు.

UN Should Consider Declaring Pakistan a Terror State: Bangladesh Envoy

దీనిని చాలా బలమైన సందేశంగా గుర్తించాలని భారత్‌లోని బంగ్లాదేశ్‌ హైకమిషనర్‌ సయ్యద్‌ మౌజెమ్‌ అలీ అన్నారు. ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్న దేశంగా పాకిస్థాన్‌ను గుర్తించి అంతర్జాతీయ సమాజంలో పాక్‌ను ఏకాకిని చేయాలన్నారు.

భవిష్యత్తులో విదేశీ పాలసీల అంశంలో పాకిస్తాన్ ఏ విధంగా ముందుకు వెళ్లాలనుకుంటుందో ఇక ఆ దేశ ఇష్టమన్నారు. బంగ్లాదేశ్‌లోని ఉగ్రవాద సంస్థలకు కూడా పాకిస్థాన్‌ సహాయం చేయడం వెంటనే ఆపేయాలని సయ్యద్‌ అలీ అన్నారు. జమ్మూ కాశ్మీర్‌లోని ఉరీ ఘటన అనంతరం పాకిస్తాన్‌ను ఉగ్రవాద దేశంగా పరిగణించాలని భారత్‌ కోరుతోంది.

English summary
Bangladesh has indicated that the United Nations should consider declaring Pakistan a "terrorist state" underlining India's argument that Islamabad should be isolated in the global community as a nation that exports terror to rest of world.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X