వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జుట్టు సరిగా కత్తిరించలేదని కాల్పులు జరిపింది!

|
Google Oneindia TeluguNews

కాలిఫోర్నియా: తన జుట్టు సరిగా కత్తిరించలేదని ఆరోపిస్తూ మంగలి(బార్బర్)పై ఓ మహిళ కాల్పులకు తెగబడింది. ఈ ఘటన అమెరికాలోని శాన్‌డియాగోలో చోటుచేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

శాన్‌డియాగో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆడ్రియాన్‌ బ్లాంచె స్వైన్‌(29) అనే మహిళ బుధవారం తన జుట్టును కత్తిరించుకోవడానికి అక్కడి ‘619 బార్బర్‌' దుకాణానికి వెళ్లింది.

Unhappy With Haircut, Woman Pulls Gun on Barber

అనంతరం ఇంటికి వెళ్లిన ఆమె.. కొద్ది గంటల్లోనే మళ్లీ షాపునకు తిరిగి వచ్చి తనకు జుట్టు కత్తిరించిన క్షురకుడిపై తుపాకీతో మూడు రౌండ్ల కాల్పులకు తెగబడింది.

తుపాకీలో బుల్లెట్లున్నప్పటికీ అదృష్టవశాత్తూ ఆ గన్‌ పేలలేదు. దీంతో వెంటనే తేరుకున్న క్షురకుడు, పక్కనున్న మరో వ్యక్తితో కలిసి ఆడ్రియాన్‌ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
ఆండ్రియాన్‌ కాల్పులకు తెగబడిన సమయంలో అక్కడ ఎనిమిది మంది ఉండగా అందరూ క్షేమంగానే ఉన్నారని పోలీసులు వెల్లడించారు.

English summary
An unhappy customer tried shooting her barber after returning to his shop with a different haircut, the barber.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X