వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ కు అమెరికా షాక్: హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సలావుద్దీన్ గ్లోబల్ టెర్రరిస్ట్

అమెరికా పాక్ కు షాకిచ్చింది. భారత్ ప్రధాన మంత్రి మోడీ అమెరికాలో పర్యటిస్తున్న సమయంలోనే పాకిస్తాన్ లో ఉంటూ భారత్ ను అల్లకల్లోలం చేస్తున్న హిజ్బుల్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు సయ్యద్ సలావుద్దీన్ ను అంతర్జ

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్:అమెరికా పాక్ కు షాకిచ్చింది. భారత్ ప్రధాన మంత్రి మోడీ అమెరికాలో పర్యటిస్తున్న సమయంలోనే పాకిస్తాన్ లో ఉంటూ భారత్ ను అల్లకల్లోలం చేస్తున్న హిజ్బుల్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు సయ్యద్ సలావుద్దీన్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.

అమెరికా రక్షణ మంత్రితో మోడీ సమావేశమైన కొద్దిసేపటి తర్వాతే అమెరికా ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. అమెరికా ప్రకటనలతో సలావుద్దీన్ కు సహకరిస్తున్న వారిపై కూడ ఆంక్షలు కొనసాగుతాయి.

syed salahuddin

సలావుద్దీన్ ప్రస్తుతం పాకిస్తాన్ లో తలదాచుకొంటూ భారత్ ను అస్థిరం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ముఖ్యంగా కాశ్మీర్ లో ఉగ్రవాదానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. కాశ్మీర్ లో అశాంతి నెలకొనడానికి అల్లర్లకు సలావుద్దీన్ కారకుడని భారత్ చాలాకాలంగా చెబుతోంది.

సలావుద్దీన్ పై చర్యలను అమెరికా త్వరలోనే ప్రకటిస్తోందని ఆశిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లో పుట్టిన సలావుద్దీన్ కు ఐదుగురు కుమారులు. ఒక కుమార్తె. వీరంతా భారత్ లోనే ఉంటారు.

English summary
The US on Monday designated Syed Salahuddin, the head of Kashmiri militant group Hizbul- Mujahideen, as a specially designated global terrorist, a move welcomed by India which said it underlines quite strongly that both the countries face threat of terrorism.The move by the US state department comes just hours before the first meeting between Prime Minister Narendra Modi and President Donald Trump at the White House.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X