వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూఎస్ 2016 ఎలక్షన్స్ : రిపబ్లికన్స్ మద్దతు చూరగొంటున్న హిల్లరీ

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్ : తొలి డిబేట్ లోనే రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై అత్యధిక మెజారిటీని దక్కించుకున్న డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తాజాగా రిపబ్లికన్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన జాన్ వార్నర్ మద్దతును చూరగొన్నారు. ఐదుసార్లు వర్జినీయా సెనేటర్ గా పనిచేసిన జాన్ వార్నర్ మద్దతును హిల్లరీ దక్కించుకోవడం ఆసక్తికరంగా మారింది.

అరిజోనా రిపబ్లికన్ న్యూస్ పేపర్ కూడా హిల్లరీ క్లింటన్ కు మద్దతు తెలిపేలా కథనాన్ని ప్రచురించడం విశేషం. 1890 తర్వాత ఓ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిని రిపబ్లికన్ న్యూస్ పేపర్ వెనకేసుకురావడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. ఇదిలా ఉంటే సోమవారం నాటి డిబేట్ తనకు నిధుల సేకరణ చేయాల్సిన అవసరాన్ని కల్పించిందని డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు.

US election 2016: Clinton gathers Republican endorsements

మొత్తంగా తన ప్రచార పర్వాన్ని మరింత ఉధృతం చేయడానికి నిధుల సేకరణపై ట్రంప్ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది.

English summary
Democratic candidate Hillary Clinton has received another endorsement from a leading Republican, two days after the first presidential debate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X