వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా నిర్ణయం: భారత ఐటీ కంపెనీలపై దెబ్బ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: భారతీయ ఐటీ కంపెనీలకు ఇబ్బంది కలిగించే వార్త. అమెరికా తీసుకున్న ఓ నిర్ణయం మన ఐటీ కంపెనీలపై పెను భారాన్ని మోపనుంది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంపై ఐటీ కంపెనీల ప్రతినిధులు ఇది వివక్షపూరితమైన నిర్ణయమని ఆరోపిస్తున్నారు.

భారత్‌కు ఎంతో మేలు చేస్తున్నామని గొప్పగా చెబుతోన్న ఒబామా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మధ్య ఉన్న సత్సంబంధాలపై కూడా ఈ నిర్ణయం ప్రభావం చూపుతోందని అంటున్నారు.

అసలు ఇంతకీ ఆ నిర్ణయం ఏంటని అనుకుంటున్నారా? ఒక్కో హెచ్-1బీ వీసాకు ఇండియన్ ఐటీ కంపెనీలు అదనంగా కనీసం 4 వేల డాలర్లు, ఒక్కో ఎల్-1 వీసాకు 4,500 డాలర్లు చెల్లించాల్సి రావడమే. గత డిసెంబర్ నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధనలు 2025 సెప్టెంబరు 30 వరకు అమల్లో ఉంటాయి.

ఈ మేరకు అమెరికా ఫెడరల్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ శుక్రవారం తన వెబ్‌సైట్‌‌లో ఉంచింది. హెచ్-1బీ వీసా వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే భారత్‌లోని ఐటీ ఉద్యోగులను అమెరికాలోని పలు కంపెనీ యజమానులు రప్పించుకునేందుకు ఉపయోగపడుతుంది.

 US formally increase in H1B and L1 visa fee for indian companies

ఇదిలా ఉంటే అమెరికాతో పాటు ఇతర దేశాల్లో కార్యాలయాలు కలిగిన అంతర్జాతీయ కంపెనీల ఉద్యోగులకు ఎల్-1 వీసాలు లభిస్తాయి. ఈ కొత్త నిబంధన వల్ల భారతీయ ఐటీ కంపెనీలపై ప్రతి ఏటా 400 మిలియన్ డాలర్ల అదనపు భారం పడుతోంది. దీంతో ప్రధాని మోడీ ఈ విషయమై అమెరికాతో మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు.

హెచ్-1బీ పిటిషనర్లు తమ కంపెనీలో 50 లేదా అంతకన్నా ఎక్కువ మంది సిబ్బంది అమెరికాలో ఉన్నపుడు, ఆ సిబ్బందిలో సగం కన్నా ఎక్కువ మంది హెచ్-1బీ, ఎల్-1ఏ లేదా ఎల్-1బీ నాన్ ఇమ్మిగ్రెంట్ స్టేటస్‌లో ఉంటే తప్పనిసరిగా అదనంగా 4 వేల డాలర్లు చెల్లించాలనేది కొత్త నిబంధన.

English summary
US formally increase in H1B and L1 visa fee for indian companies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X