వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నంత పనైంది: తగ్గిన హెచ్ 1 బీ వీసా దరఖాస్తులు.. ట్రంప్ విధానాలు నెలకొల్పిన అనిశ్చితి వల్లే

అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచి మొదలైన ఆందోళన.. ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత వాస్తవ రూపం దాల్చింది

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచి మొదలైన ఆందోళన.. ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత వాస్తవ రూపం దాల్చింది. హెచ్ 1 బీ వీసా చాలా చౌక వేతన విధానమని వాదిస్తూ వచ్చిన ట్రంప్.. చివరకు తాననుకున్నదే చేయ సంకల్పించారు.

2018 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతిభా వంతులకే హెచ్ 1 బీ వీసా జారీ చేయాలన్న నిర్ణయాన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రూపంలో జారీ చేశారు. దీనికి తోడు ట్రంప్ ప్రకటనలు, ఆచరణలో తీసుకుంటున్న నిర్ణయాలు ఒకేలా ఉండటంతో విదేశీయుల్లో ప్రత్యేకించి భారతీయ ఐటీ నిపుణుల్లో ఆందోళన మొదలైంది. అమెరికాలోని వివిధ సంస్థల్లో పనిచేస్తున్న భారతీయ ఐటీ నిపుణులు, విద్యార్థులు.. గ్రీన్ కార్డు పొంది శాశ్వత నివాసంతో స్థిరపడిపోదామన్న కలలు కల్లలుగా మారిపోతున్నాయి.

దాని ఫలితమే 2018 ఆర్థిక సంవత్సరానికి హెచ్ 1 బీ వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఐదేళ్లలో తొలిసారి భారీగా తగ్గిపోయింది. హెచ్ ‌1 బీ వీసాలకు దరఖాస్తులు ఈసారి ఏకంగా 16 శాతం పడిపోయాయి. అందులో గరిష్ఠంగా భారతీయులవేనని నిపుణులు సృష్టం చేస్తున్నారు.

ఐదు రోజుల్లోనే దరఖాస్తుల స్వీకరణ పూర్తి

ఐదు రోజుల్లోనే దరఖాస్తుల స్వీకరణ పూర్తి

ట్రంప్‌ అమలు చేయబూనుకున్నవి ఇప్పటి వరకు ప్రతిపాదనలే అయినా ఆయన చర్యలను గమనిస్తున్న భారతీయులు హెచ్ 1 బీ వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి కొంత వెనకడుగు వేసినట్లు భావిస్తున్నారు. ఏప్రిల్‌ వచ్చిందంటే భారతీయ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, అమెరికాలో చదువుతున్న మన విద్యార్థుల ఆలోచనలన్నీ హెచ్‌1బీ వీసా చుట్టే తిరుగుతాయి. ప్రతి ఏటా అమెరికాలో ఉద్యోగాలు చేసేందుకు 85 వేల హెచ్ ‌- 1 బీ వీసాలను అక్కడి ప్రభుత్వం జారీ చేస్తుంది. అందులో 20 వేలు అక్కడ మాస్టర్‌ డిగ్రీ చదువుకున్న విద్యార్థులకు కేటాయిస్తారు. మిగతా వాటిని ప్రపంచవ్యాప్తంగా నిపుణులకు జారీ చేస్తారు. ఇందుకోసం అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్‌) ఈసారి ఏప్రిల్‌ 3 నుంచి దరఖాస్తులు స్వీకరించింది. లాటరీ విధానంలో ఎంపిక ప్రక్రియ మొదలైంది.

ఐదేళ్లలో తొలిసారి తగ్గిన దరఖాస్తులు

ఐదేళ్లలో తొలిసారి తగ్గిన దరఖాస్తులు

2017లో 2.36 లక్షల మంది హెచ్‌ 1 బీ కోసం దరఖాస్తు చేసుకోగా, 2018కి ఆ సంఖ్య 37 వేలకు తగ్గిపోయి 1.99 లక్షల దరఖాస్తుల వద్ద స్థిరపడింది. ఇది అక్షరాలా 16 శాతం తగ్గుదల. హెచ్‌1బీ వీసా కింద ఏడాదికి కనీస వేతనం 1.30 లక్షల డాలర్లు ఉండాలని ట్రంప్‌ బిల్లు ప్రవేశపెట్టడం, అమెరికన్లకే ప్రాధాన్యం తదితర ప్రతిపాదనల నేపథ్యంలో భారతీయులపై ప్రభావం చూపిందని భావిస్తున్నారు. మనదేశంలోనే ఉద్యోగం చేస్తూ అమెరికాలోని కన్సల్టెన్సీల ద్వారా సొంతంగా హెచ్‌1బీ వీసా కోసం ప్రయత్నాలు చేసేవారు తగ్గినట్లు చెబుతున్నారు. అమెరికాలో చదువుకొని..ఐచ్ఛిక ప్రాక్టికల్‌ శిక్షణ (ఓపీటీ)లో ఉన్న విద్యార్థులు విద్యార్థి కోటాకు సంబంధించిన 20 వేల వీసాలకు దరఖాస్తు చేసుకుంటారు.

హెచ్ 1 బీ వీసాల జారీపై ట్రంప్ మనోగతం ఇదీ

హెచ్ 1 బీ వీసాల జారీపై ట్రంప్ మనోగతం ఇదీ

కానీ అమెరికాలో చదువుకునే విద్యార్థులకు హెచ్‌1బీ వీసాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని ట్రంప్‌ ఆలోచనగా ఉందని అబ్రాడ్‌ క్యాంపస్‌ కన్సట్టెన్సీ సంచాలకులు మహేష్‌ తెలిపారు. విద్యార్థి కోటాలో హెచ్‌1బీ వీసా పొందిన వారికి వార్షిక వేతనం 1.30 లక్షల డాలర్లు నిబంధన వర్తిస్తే మాత్రం సమస్య తప్పదని భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఆ నిబంధనలు ఏమిటన్నది వెల్లడి కాలేదు. లాటరీ ద్వారా హెచ్‌1బీ వీసాలకు ఎంపిక ప్రక్రియ వచ్చే నెలాఖరు వరకు కొనసాగుతుంది. దేశీయ ఓపీటీలో మేం వివిధ అంశాలపై ఆన్‌లైన్‌ ద్వారా అభిప్రాయాలను తీసుకున్నట్లు మహేశ్ తెలిపారు. ఇదే ప్రక్రియ హెచ్‌1బీ వీసాలపై కూడా నిర్వహించామన్నారు. తమ సంస్థలో 5 వేల మంది పేర్లు నమోదు చేసుకున్నారు, వారిలో 15 శాతం మందికి హెచ్‌ 1 బీ దక్కిందని 60 శాతం మంది వేచి చూస్తున్నట్లు తెలిపారు. 5 శాతం మంది దరఖాస్తులు తిరస్కరించారన్నారు. 20 శాతం తాము దరఖాస్తు చేయలేదని చెప్పారు.

2013 నుంచి పెరుగుతున్న దరఖాస్తులు

2013 నుంచి పెరుగుతున్న దరఖాస్తులు

2014లో 1.24 లక్షల దరఖాస్తులు దాఖలైతే అది 2015లో 1,72,500 దరఖాస్తులకు చేరుకున్నది. 2016లో భారీ స్థాయిలో 2.33 లక్షలకు, 2017లో 2.36 లక్షల నుంచి 2018లో 1.99 లక్షల దరఖాస్తులకు పడిపోయింది. అమెరికాలో ఆర్థిక సంవత్సరం అక్టోబర్ నుంచే మొదలవుతుంది. కనుక వచ్చే ఆర్థిక సంవత్సరం దరఖాస్తులను ఏప్రిల్ నుంచే సేకరిస్తారు. ఆ మాటకు వస్తే 2013లోనే క్రమంగా హెచ్ 1 బీ వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య పెరిగింది.

హెచ్ 1 బీ వీసా దరఖాస్తుల తగ్గుదలపై నిపుణుల ఆశ్చర్యం

హెచ్ 1 బీ వీసా దరఖాస్తుల తగ్గుదలపై నిపుణుల ఆశ్చర్యం

ప్రస్తుత హెచ్ 1 బీ వీసాతోపాటు చట్టాలన్నీ సమీక్షిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినా.. ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు జారీచేసినా ఆచరణలో అమెరికా కాంగ్రెస్ ఆమోదిస్తేనే అవి చట్ట రూపం దాలుస్తాయి మరి. ప్రతిభావంతులైన నిపుణులకు మాత్రమే హెచ్ 1 బీ వీసా జారీ చేయాలని సంకల్పిస్తూ ట్రంప్ తాజాగా జారీ చేసిన ఆదేశాలకూ ఇదే వరిస్తుందని చెప్తున్నారు. ఆశ్చర్యకరమైన రీతిలో హెచ్ 1 బీ వీసా దరఖాస్తులు తగ్గుముఖం పట్టాయని అమెరికా ఇమ్మిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విలియ్ స్టాక్ పేర్కొన్నారు.ఇతర బిజినెస్ ప్రోగ్రామ్ ల నిర్వహణ అవసరాలపై సంస్థలు ద్రుష్టి సారించినందు వల్లే దరఖాస్తులు తగ్గిపోయి ఉండవచ్చునన్నారు. గతేడాది కాలిఫోర్నియాలో భారతదేశానికి చెందిన ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రో ఉద్యోగులకు చెందిన దరఖాస్తులే అధికమని గణాంకాలు చెప్తున్నాయి.

ప్రతిభ ఆధారిత విధానానికేనన్న అమెరికా వాణిజ్య మంత్రి విల్బర్ రాస్

ప్రతిభ ఆధారిత విధానానికేనన్న అమెరికా వాణిజ్య మంత్రి విల్బర్ రాస్

హెచ్‌1బి వీసాల నిబంధనల కఠినతరానికి ట్రంప్‌ యంత్రాంగం చేపట్టిన చర్యలపై భారత్‌ ఆందోళనలను అమెరికా వాణిజ్య మంత్రి విల్బర్ రాస్ వద్ద కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ గట్టిగా లేవనెత్తారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారత వృత్తి నిపుణులు చేసిన గణనీయ కృషి గురించి జైట్లీ ప్రస్తావించారు. అమెరికా యంత్రాంగం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు దేశాల మధ్య జరిగిన తొలి కేబినెట్‌ స్థాయి సమావేశం ఇది. హెచ్‌1బి వీసాల అంశాన్ని సమీక్షించే ప్రక్రియను అమెరికా ప్రారంభించిందని, ఇంకా ఈ అంశంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని రాస్‌ చెప్పారు. అత్యంత నైపుణ్యం ఉన్న వారికి ప్రాధాన్యం ఇచ్చే ప్రతిభ ఆధారిత వలస విధానాన్ని తేవడమే ట్రంప్‌ యంత్రాంగం లక్ష్యమన్నారు.

English summary
The US has received 37,000 less petitions for the H-1B visas for the 2018 fiscal year, the country's immigration agency has said amidst a revamp of the visa programme popular among Indian IT firms and professionals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X