పాకిస్తాన్ కు షాకిచ్చిన అమెరికా.. ఐదు ఉగ్రవాద సంస్థలపై ఆంక్షలు!

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: పాకిస్తాన్ కు అమెరికా షాకిచ్చింది. ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌ నిర్వహిస్తున్న జమాత్-ఉద్-దవా (జేయూడీ), లష్కరే తాయిబా, జమాత్-ఉల్-దవా అల్-ఖురాన్ (జేడీక్యూ), ఐసిస్ సంస్థలపై ఆంక్షలు విధించింది. నిధుల సేకరణతోపాటు వారి నాయకత్వాన్ని దెబ్బతీసేందుకు అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

హయతుల్లా గులాం ముహమ్మద్ (హజి హయతుల్లా), అలీ ముహమ్మద్ అబు తురబ్, ఇనాయత్-ఉర్-రహ్‌మాన్‌తోపాటు ఆ సంస్థ ఆధ్వర్యంలోని చారిటీ సంస్థలు, వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ జమాత్-ఉద్-దవా ఫర్ ఖురాన్ అండ్ సున్నా(డబ్ల్యుడీవో)పై అమెరికా ఆంక్షలు విధించింది.

hafeez-syed

పాకిస్థాన్‌లోని ఉగ్ర సంస్థల నిధుల సేకరణను అడ్డుకునే లక్ష్యంతోనే ఈ ఆంక్షలు విధించినట్టు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ ఆఫీస్ ఆఫ్ ఫారెన్ అస్సెట్స్ కంట్రోల్ (ఓఎఫ్ఏసీ) డైరెక్టర్ జాన్ స్మిత్ తెలిపారు.

తాలిబన్, అల్-ఖాయిదా, ఐసిస్, లష్కరే తాయిబా వంటి ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులను నియమించుకోవడానికి, ఆత్మాహుతి దళాలు నిధులు సమకూర్చుకునేందుకు, ఉగ్రవాద కార్యాకలాపాలకు పాకిస్తాన్ మద్దతు ఇస్తోందని ఆయన ఆరోపించారు.

English summary
The US has imposed sanctions on Pakistan-based extremists and an organisation run by Mumbai attack mastermind Hafiz Saeed’s JuD group as part of an effort to disrupt their leadership and fund-raising networks. The sanctions have been slapped to disrupt the funding of Lashkar-e-Taiba (LeT) and its front for charitable activities, the Jamaat-ud-Dawah, the Taliban, Jamaat-ul-Dawa al-Qu’ran (JDQ), the Islamic State of Iraq and Syria, and ISIS–Khorasan. Khorasan is a historical region comprising a vast territory covering northeastern Iran, southern Turkmenistan, and northern Afghanistan and parts of India.
Please Wait while comments are loading...