వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గౌరవం:కొడుకుతో పాటు తల్లికి ఎంబీఏ సర్టిఫికెట్, ఎందుకంటే?

పక్షవాతం వచ్చి వీల్ ఛైర్ కే పరిమితమైన కన్నకొడుకు చదువు కోసం ఓ మాతృమూర్తి చూపిన అకుంఠిత దీక్షకు ఘనమైన సత్కారం లభించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

కాలిఫోర్నియా: పక్షవాతం వచ్చి వీల్ ఛైర్ కే పరిమితమైన కన్నకొడుకు చదువు కోసం ఓ మాతృమూర్తి చూపిన అకుంఠిత దీక్షకు ఘనమైన సత్కారం లభించింది. కొడుకుతోపాటు తల్లికి కూడ ఎంబీఏ సర్టిఫికెట్ ను ఇచ్చి గౌరవించారు ఆ తల్లిని యూనివర్శిటీ అధికారులు.

ప్రాథమిక పాఠశాల రిటైర్డ్ టీచరైన జ్యూడీ ఓ కానర్ వీల్ ఛైర్ లోని తన కొడుకు మార్టిన్ స్నాతకోత్సవ వేదికపైకి తీసుకురాగానే మార్టిక్ కే కాదు, జ్యూడీకి కూడ ఎంబీఏ పట్టాను అందిస్తున్నట్టు ప్రకటించి ఆశ్చర్యంలో ముందచెత్తారు చాప్ మన్ యూనివర్శిటీ అధికారులు.

US mother who went to classes with quadriplegic son gets MBA degree

ఈ అనుహ్యా ప్రకటనతో భావోద్వేగానికి లోనైన జ్యూడీ స్కూల్ లో ఉండడం తనకు ఇష్టమని తరగతి గదిలో గడిపిన ప్రతి నిమిషాన్ని తాను ఆస్వాదిస్తున్నట్టు పేర్కొంది.

మార్టి ఓ కానర్ కొలరాడో యూనివర్శిటీలో డిగ్రీ పూర్తి చేశాడు. 2012 లో ఓ ప్యాకేజింగ్ కంపెనీలో పనిచేస్తుండగా మెట్లమీదనుండి పడి పక్షవాతానికి గురయ్యాడు. అప్పటినుండి ఆయన వీల్ ఛైర్ కే పరిమితమయ్యారు.

కొడుకు చదువు కోసం అన్నీ తానై కష్టపడింది జ్యూడీ, ఫ్లోరిడాలో నివాసముండే జ్యూడీ కొడుకు చదువుకోసం దక్షిణ కాలిఫోర్నియాకు మకాం మార్చింది. వీల్ చైర్ లో ఉ:డే జ్యూడీ ఐప్యాడ్ ,ల్యాప్ ట్యాప్ ,వాయిస్ రికగ్నిషన్ సాఫ్ట్ వేర్ తదితర పరికరాలను ఉపయోగించగలడు. కానీ, స్వంతంగా నోట్స్ రాసుకోలేడు. ఆ పనిచేసేందుకు తల్లి జ్యూడీ కూడ తరగతులకు హజరయ్యేది.

English summary
A Southern California university has awarded an honorary degree to the mother of a quadriplegic student after she attended every class with him and took his notes while he pursued his Master of Business Administration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X