వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తరకొరియాకు మూడినట్లే! బయలుదేరిన అమెరికా రెండో నౌక.. ఇక యుద్ధం అనివార్యం!?

ఉత్తర కొరియా, అమెరికా మధ్య యుద్ధం అనివార్యంగా కనిపిస్తోంది. ఉత్తర కొరియాకు తన తడాఖా ఏమిటో చూపించాలని భావించిన అమెరికా తొలుత ఓ యుద్ధ నౌకను ఉత్తర కొరియా సముద్ర జలాలకు సమీపంలోకి పంపించింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: ఉత్తర కొరియా, అమెరికా మధ్య యుద్ధం అనివార్యంగా కనిపిస్తోంది. ఉత్తర కొరియాకు తన తడాఖా ఏమిటో చూపించాలని భావించిన అమెరికా తొలుత ఓ యుద్ధ నౌకను ఉత్తర కొరియా సముద్ర జలాలకు సమీపంలోకి పంపించింది.

అయినా ఉత్తరకొరియా ఏమాత్రం లెక్కచేయకుండా తాజాగా మరో క్షిపణి పరీక్ష కూడా నిర్వహించింది. మరోవైపు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న 'వన్నాక్రై' రాన్సమ్ వేర్ వైరస్ అటాక్ వెనుక కూడా ఉత్తర కొరియా హస్తమున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో ఉత్తరకొరియాకు బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో అమెరికా తాజాగా తన రెండో యుద్ధనౌక రోనాల్డ్ రీగన్ ను కూడా బయలుదేరదీసింది. ప్రస్తుతం ఈ యుద్ధనౌకను ఉత్తర కొరియా సముద్ర జాలాల దిశగా నడిపిస్తోంది. దీంతో అమెరికా ఏ క్షణాన్నైనా ఉత్తరకొరియాపై దాడికి దిగవచ్చనే సంకేతాలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే గనుక జరిగితే

సత్తా చూపించే దిశగా అమెరికా అడుగులు...

సత్తా చూపించే దిశగా అమెరికా అడుగులు...

ఈ సైబర్ దాడి వెనుక ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ హస్తమున్నట్లు అనుమానాలు వ్యక్తమవడంతో అమెరికాకు అరికాలి మంట నెత్తికెక్కింది. దీంతో తన సత్తా ఏమిటో ఉత్తరకొరియాకు కచ్చితంగా చూపించాలనే భావనకు వచ్చింది అమెరికా.

కదిలిన అమెరికా రెండో యుద్ధనౌక...

కదిలిన అమెరికా రెండో యుద్ధనౌక...

మొన్నటికి మొన్న ఓ యుద్ధ నౌకను ఉత్తర కొరియా సముద్ర జలాలకు సమీపంలోకి తీసుకెళ్లిన అమెరికా తాజాగా మరో యుద్ధ నౌకను బయల్దేరదీసింది. తాజాగా యుద్ధ సమయంలో అత్యంత కీలక పాత్ర పోషించే యూఎస్‌ఎస్‌ రోనాల్డ్‌ రీగన్‌ యుద్ధ నౌకను కూడా అటువైపే పంపిస్తోంది.

ఉత్తర కొరియా ఖాతరు చేయకపోవడం వల్లే...

ఉత్తర కొరియా ఖాతరు చేయకపోవడం వల్లే...

ఇప్పటికే అక్కడ ఉన్న యూఎస్‌ఎస్‌ కార్ల్‌ విన్సన్‌, రోనాల్డ్‌ రీగన్ యుద్ధనౌకలు రెండూ కలిసి యుద్ధ విన్యాసాలు చేయనున్నట్లు అమెరికా రక్షణశాఖ అధికారులు చెప్పారు. గత ఏప్రిల్‌ 5న, ఇటీవల ఉత్తర కొరియా మరోసారి తన బాలిస్టిక్‌ అణుక్షిపణిని పరీక్షించడం, అమెరికాపై దాడి చేస్తామంటూ రెచ్చగొట్టేలా మాట్లాడటం వంటి పరిణామాల దృష్ట్యా ఇప్పుడు ఉత్తర కొరియా వైపు అమెరికా యుద్ధ నౌకలు రావడం మరింత ఆందోళనను కలిగిస్తోంది.

ఇన్నాళ్లూ జపాన్ సముద్ర జలాల్లో...

ఇన్నాళ్లూ జపాన్ సముద్ర జలాల్లో...

అమెరికా యుద్ధనౌక రోనాల్డ్ రీగన్ ఇన్నాళ్లూ జపాన్‌లోని యోకోసుకాలోని హోమ్‌పోర్ట్‌లో ఉంది. ఆ దేశంతో అమెరికా చేసుకున్న ఒప్పందం మేరకు అక్కడి సముద్ర తీర పర్యవేక్షణ బాధ్యతలు ఈ యుద్ధనౌక చేపట్టింది. ప్రస్తుతం ఒప్పందం గడువు ముగియడంతో అమెరికా తన యుద్ధనౌకను అక్కడ్నించి కదిలించింది.

ఉత్తరకొరియాకు బుద్ధి చెప్పేందుకే...

ఉత్తరకొరియాకు బుద్ధి చెప్పేందుకే...

ఎంతకీ ఉత్తర కొరియా లొంగకపోవడంతో ఇక తమ సత్తా ఏమిటో ఆ దేశానికి చూపించాలనే అమెరికా భావిస్తున్నట్లు తాజా చర్య ద్వారా స్పష్టమవుతోంది. అందుకే జపాన్ తో చేసుకున్న ఒప్పందం గడువు ముగిసిన వెంటనే తన యుద్ధనౌక రోనాల్డ్‌ రీగన్ కూడా ఉత్తర కొరియా సముద్ర జలాల దిశగా కదిలించాలంటూ అమెరికా రక్షణ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

మరో రెండు భారీ నౌకలు కూడా...

మరో రెండు భారీ నౌకలు కూడా...

ఇదొక్కటే కాదు, దీంతోపాటు రెండు మరో భారీ నౌకలు కూడా ఉత్తరకొరియా దిశగా వెళుతున్నాయి. ‘చాలాకాలంగా నిర్వహిస్తున్న బాధ్యతలు ముగిసిన నేపథ్యంలో రోనాల్డ్‌ రీగన్‌, ఇతర దాడులకు సంబంధించిన గ్రూపులను అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించాం. అందులో భాగంగా ప్రస్తుతం కొరియా ద్వీపకల్పం వైపు తీసుకెళుతున్నాం' అని రియర్ అడ్మిరల్ చార్లెస్‌ విలియమ్స్‌ చెప్పారు.

 పైకి విన్యాసాలు.. లోలోపల యుద్ధ సన్నాహాలు

పైకి విన్యాసాలు.. లోలోపల యుద్ధ సన్నాహాలు

రోనాల్డ్ రీగన్ యుద్ధనౌక అక్కడికి చేరుకోగానే ఇప్పటికే కొరియా సముద్ర జలాల్లో తిష్టవేసిన కార్ల్‌ విన్సన్‌ యుద్ధనౌకతో కలిసి శిక్షణ సంబంధమైన విన్యాసాలను నిర్వహించనుంది. ప్రధానంగా ఈ విన్యాసాలు యుద్ధ విమానాన్ని విజయవంతంగా ప్రయోగించడంతోపాటు తిరిగి దానిని సురక్షితంగా దించడం అనే అంశం మీద ఉంటాయి.

టార్గెట్ ఉత్తరకొరియానే...

టార్గెట్ ఉత్తరకొరియానే...

నిజానికి కార్ల్‌ విన్సన్‌ యుద్ధనౌకను తొలుత ఉత్తర కొరియా వైపు నడిపించిన అమెరికా ఆ తరువాత దానిని తాము ఆస్ట్రేలియాలో విన్యాసాల కోసమే పంపుతున్నామంటూ ప్రపంచ దేశాలను ఏమార్చింది. నిజానికి ఈ యుద్ధ నౌక ఆస్ట్రేలియా వైపు వెళ్లలేదట. ఇప్పటికీ ఇది ఉత్తర కొరియాకు సమీపంలోని సముద్రజలాల్లోనే ఉన్నట్లు తాజా సమాచారం. తాజాగా తమ రెండో యుద్ధ నౌక రోనాల్డ్ రీగన్ ను కూడా దీని దగ్గరికే పంపిస్తుండడంతో ఇక అమెరికా ఏ క్షణాన్నైనా ఉత్తరకొరియాపై దాడికి పాల్పడే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.

English summary
The US Navy is moving the USS Ronald Reagan aircraft carrier to the Korean Peninsula where it will conduct dual-carrier training exercises with the USS Carl Vinson amid heightened tensions in the region, two defense officials told CNN. The move comes just days after North Korea demonstrated a significant leap forward in their missile program after launching a projectile that achieved "successful" controlled reentry into the Earth's lower atmosphere rather than falling back to the surface, according to a preliminary US intelligence analysis, two US officials tell CNN.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X