వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నో సారీ: ఆ ఘనత ఒబామాదే, నివాళి(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హిరోషిమా: జపాన్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు శుక్రవారం హిరోషిమా స్మారక స్థూపాన్ని సందర్శించి పుష్ప నివాళి సమర్పించారు. ఆ తర్వాత రెండు నిమిషాల పాటు కళ్లు మూసుకుని మౌనం పాటించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా తన అణు బాంబుని హిరోషిమా నగరంపై ప్రయోగించింది.

అణుబాంబు దాడి వల్ల హిరోషిమాలో సుమారు 1,40,000 మంది మరణించారు. రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమాపై అమెరికా అణుబాంబు దాడి చేసిన తర్వాత తొలిసారి ఓ అమెరికా అధ్యక్షుడు హిరోషిమా స్థూపాన్ని సందర్శించిన ఘనత బరాక్ ఒబామాకే చెందింది.

ఒబామా వెంట జపాన్ ప్రధాని ప్రధాని షింజో అబే కూడా హిరోషిమా స్ధూపం వద్ద నివాళి అర్పించారు. 1945, ఆగస్టు 6న అమెరికా హిరోషిమా నగరంపై అణు బాంబుని ప్రయోగించింది. సుమారు 70 ఏళ్ల కిందట జరిగిన ఈ అణుదాడి మానవ సమాజాన్ని రూపుమార్చే శక్తి అని తెలిసిపోయింది.

ఈ సందర్భంగా బరాక్ ఒబామా మాట్లాడుతూ అణు బాంబు దాడి జరిగిన ఘటనను కేవలం మాటలతో వర్ణించలేమన్నారు. ఆ నాటి గుర్తులు మనతోనే ఉండిపోతాయన్నారు. ఆ ఆలోచనలే మనకు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. ఆ దురదృష్టకరమైన సంఘటన నుంచి ఆ ఆలోచనలే మనకు ఆశను నింపాలన్నారు.

 సారీ చెప్పలేదు: హిరోషిమాలో ఒబామా, నివాళి

సారీ చెప్పలేదు: హిరోషిమాలో ఒబామా, నివాళి

అణు బాంబు దాడి జరిగిన తర్వాత ఏర్పడ్డ మేఘాల్ని మనం మరవలేమన్నారు. ఆ గుర్తులు మానవత్వాన్ని వీడలేవన్నారు. సైన్స్ అద్భుతాలు మరింత మెరుగైన కిల్లింగ్ మెషీన్లను తయారు చేయగలవన్నారు. అణు బాంబు దాడి వల్ల మరణించిన వారి ఆత్మలు మనతో మాట్లాడుతున్నాయని చెప్పారు. యుద్ధం ఒక్కటే హిరోషిమాను వేరు చేయలేదన్నారు.

సారీ చెప్పలేదు: హిరోషిమాలో ఒబామా, నివాళి

సారీ చెప్పలేదు: హిరోషిమాలో ఒబామా, నివాళి


జపాన్, అమెరికా మిత్రదేశాలే కాదు, ఈ రెండు దేశాల మధ్య ఇప్పుడు మధ్య స్నేహం ఉందన్నారు. నిరంతర ప్రయత్నం వల్ల చేదు జ్ఞాపకాలను మరిచిపోవచ్చన్నారు. మనది మానవ జాతి. మళ్లీ మనం ఒకటి కావచ్చు. మనం నేర్చుకోవచ్చు. మన ఇష్టాన్ని ఎన్నుకోవచ్చు. మన పిల్లలకు భిన్నమైన కథలను చెప్పుకోవచ్చు.

సారీ చెప్పలేదు: హిరోషిమాలో ఒబామా, నివాళి

సారీ చెప్పలేదు: హిరోషిమాలో ఒబామా, నివాళి

క్రూరత్వం లేని సమాజాన్ని సృష్టించడమే ధ్యేయమన్నారు. బాంబు దాడిలో మరణించినవాళ్లు మన లాంటివాళ్లేనని కొందరు అనుకుంటారు. యుద్ధం అవసరం లేదన్న ఆలోచనలో వాళ్లు ఉంటారు. సైన్సు అభివృద్ధి వల్ల జీవితాలు మరింత మెరుగుపడాలని భావిస్తారు. శాంతి ఎంతో విలువైందన్నారు.
 సారీ చెప్పలేదు: హిరోషిమాలో ఒబామా, నివాళి

సారీ చెప్పలేదు: హిరోషిమాలో ఒబామా, నివాళి


అయితే 1946లో హిరోషిమాపై అమెరికా అణు బాంబు దాడి ఘటనపై బరాక్ ఒబామా క్షమాపణ చెప్పక పోవడం విశేషం. రెండో ప్రపంచ యుధ్దంలో తొలుత ఆగస్టు 6న హిరోషిమాపై అణు దాడి చేసిన అమెరికా ఆ తర్వాత ఆగస్టు 9న నాగసాకిపై అణుబాంబుని ప్రయోగించింది.

సారీ చెప్పలేదు: హిరోషిమాలో ఒబామా, నివాళి

సారీ చెప్పలేదు: హిరోషిమాలో ఒబామా, నివాళి


ఈ రెండు సిటీల అణు బాంబు దాడి ఘటనలో మొత్తం 220,000 మంది అధికారికంగా ధ్రువీకరించారు. కాగా హిరోషిమాలో ఒబామా పర్యటించడం చరిత్రాత్మకమని జపాన్ ప్రధాని అబే అన్నారు. ప్రపంచ ప్రజలు అణ్వస్త్ర రహిత సమాజాన్ని కోరుకుంటున్నారన్నారు.

English summary
US President Barack Obama has paid tribute to the victims of America’s first atomic bombing during a visit to Hiroshima, Japan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X