వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయ్ మాల్యాకు భారీ ఊరట, చోర్.. చోర్ వ్యాఖ్యలపై షాకింగ్ జవాబు

బ్యాంకులకు రూ.9 వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాల‌కు పారిపోయిన వ్యాపార‌వేత్త‌ విజయ్‌ మాల్యాకు తాత్కాలిక కోర్టులో ఊరట లభించింది. ఆయన బెయిల్‌ను న్యాయస్థానం మరో ఆరు నెలలు పొడిగించింది.

|
Google Oneindia TeluguNews

లండన్: బ్యాంకులకు రూ.9 వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాల‌కు పారిపోయిన వ్యాపార‌వేత్త‌ విజయ్‌ మాల్యాకు తాత్కాలిక కోర్టులో ఊరట లభించింది. ఆయన బెయిల్‌ను న్యాయస్థానం మరో ఆరు నెలలు పొడిగించింది.

దొంగా.. దొంగా అంటూ: ఓవల్ స్టేడియంలో మాల్యాకు చేదు అనుభవం

విజయ్ మాల్యాను తిరిగి భారత దేశానికి రప్పించేందుకు అధికారులు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ రోజు లండ‌న్ కోర్టులో ఈ కేసు విచార‌ణకు వ‌చ్చింది. విచారణ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది.

ఆరు నెలలు పొడిగింపు

ఆరు నెలలు పొడిగింపు

ఆయ‌న‌కు ఇచ్చిన‌ బెయిల్‌ గడువును మ‌రో ఆరు నెల‌ల వ‌ర‌కు (డిసెంబర్ 4) పొడిగిస్తున్న‌ట్లు న్యాయస్థానం పేర్కొంది. ఈ కేసులో త‌దుప‌రి విచార‌ణ‌ను వ‌చ్చే నెల‌ 6కు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. అనంత‌రం కోర్టు బ‌య‌ట విజయ్‌ మాల్యా మీడియాతో మాట్లాడారు. తాను నిర్దోషినని చెప్పాడు. భారత స‌ర్కారు తనపై మోపిన అభియోగాలన్నీ నిరాధారమైనవని చెప్పాడు.

స్టేడియంలో చోర్ చోర్ కామెంట్లపై..

స్టేడియంలో చోర్ చోర్ కామెంట్లపై..

త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు అవాస్త‌వాల‌ని, తాను అమాయకుడినని, ఎవరినీ మోసం చేయలేదని తెలిపారు. కోర్టు కార్య‌క‌లాపాలు ఇంకా సాగుతున్నాయ‌ని, త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌న్నింటినీ తిర‌స్క‌రిస్తున్న‌ట్టు చెప్పారు. ఏ కోర్టు నుంచీ తాను త‌ప్పించుకోలేద‌న్నారు. న్యాయ‌స్థానంలో హాజ‌రుకావ‌డం త‌న క‌ర్త‌వ్యం గ‌న‌కే కోర్టుకు హాజ‌ర‌య్యాన‌న్నారు. త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు త‌ప్ప‌ని నిరూపించేందుకు త‌గిన ఆధారాలు త‌న వ‌ద్ద ఉన్నాయన్నాడు. అంతేకాదు, క్రికెట్ స్టేడియంలో తనను చోర్.. చోర్ (దొంగ.. దొంగ) అంటూ స్టేడియంలో చుట్టుముట్టి గేలి చేసిన సంఘటన పైన కూడా మాల్యా స్పందించాడు.

నాకు మంచి జరగాలని అందరూ కోరుకున్నారు

నాకు మంచి జరగాలని అందరూ కోరుకున్నారు

ఓవెల్ మైదానంలో తనను ఎవరు కూడా దొంగ అని అనలేదని చెప్పాడు. తప్పతాగి ఉన్న ఇద్దరు వ్యక్తులు మాత్రమే తనపై అరిచారని చెప్పాడు. మిగతా వారంతా తన వద్దకు వచ్చి మంచి జరగాలని కోరుకున్నారని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

వారిద్దరికి పొగడ్తలు

వారిద్దరికి పొగడ్తలు

క్రికెట్ అభిమానులు స్టేడియం వద్ద తనను అవమానించారన్న మీడియా వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఇదిలా ఉండగా, మాల్యా అలా చెప్పగానే ఆయనపై అరిచిన ఆ ఇద్దరిని ట్విట్టర్లో పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆ ఇద్దరికీ సెల్యూట్ అని పేర్కొంటున్నారు.

English summary
Vijay Mallya, the embattled tycoon who is wanted in India on loan defaults to several banks, today claimed that he has "enough evidence" to plead his case as a UK court granted him bail until December 4.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X