వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చావాలనుకోవడం లేదు కదా: ప్రయాణీకులకు ఎయిర్ హోస్టెస్ షాక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

గ్లాస్ గో: విమానంలో ఓ ఎయిర్ హోస్టెస్ అప్రస్తుత ప్రసంగం చేసి ప్రయాణీకులను బెదరగొట్టిన సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది. గ్లాస్ గో - డబ్లిన్ విమానంలో ఈ ఆసక్తికర సంఘటన జరిగింది.

ర్యానేయిర్ ఎయిర్ లైన్స్‌కి చెందిన ఓ విమానం గ్లాస్ గో నుంచి డబ్లిన్‌ వెళ్లవలసి ఉంది. షెడ్యూల్డ్‌ సమయానికన్నా ఎనిమిది గంటలు ఆలస్యంగా విమానం బయలుదేరింది.

'We don't want to die': Ryanair crewmember's epic fail shocks passengers, goes viral

ఈ సమయంలో ప్రయాణీకులు ఎయిర్ హోస్టెస్‌ను ప్రశ్నించారు. ఎందుకు ఇంత ఆలస్యం అని అడిగారు. దానికి ఎయిర్ హోస్టెస్ నుంచి షాకింగ్ సమాధానం వచ్చింది. ఇది వారిని భయకంపితులను చేసింది.

విమానం రెక్కల పైన మంచు పేరుకు పోయినప్పుడు పైలట్‌ విమానాన్ని టేకాఫ్‌ చేయలేడని, మనలో ఎవరూ చావాలనుకోవడం లేదు కదా.. అని సదరు ఎయిర్ హోస్టెస్ అన్నది.

దీంతో విమానంలోని ప్రయాణీకులు బిత్తరపోయారు. ఎయిర్ హోస్టెస్‌ ఈ విధంగా చెబుతుండగా.. ప్రయాణికుల్లో ఒకరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇది కాస్తా వైరల్‌ కావడంతో ఎయిర్ లైన్స్‌ అధికారులు ప్రయాణికులకు క్షమాపణలు చెప్పి ఎయిర్ హోస్టెస్‌పై చర్యలు తీసుకుంటామన్నారు.

English summary
'We don't want to die': Ryanair crewmember's epic fail shocks passengers, goes viral.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X